Tollywood | టాలీవుడ్‌లో నయా ట్రెండ్ – ప్రొడ్యూసర్లుగా రాణిస్తున్న స్టార్ డాటర్స్
టాలీవుడ్ స్టార్ హీరోల కూతుళ్లు ప్రొడ్యూసర్లుగా అదరగొడుతోన్నారు. మన శంకర వరప్రసాద్‌గారు మూవీతో చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతగా బిగ్గెస్ట్ హిట్‌ను దక్కించుకొంది. బాలకృష్ణ కూతురు తేజస్వినితో పాటు మరికొందరు స్టార్ డాటర్స్ నిర్మాతలుగా సినిమాలు చేస్తోన్నారు.
Entertainment | Published On Feb 7, 2026, 12.29 pm IST
Tollywood | ఇండస్ట్రీలో వారసత్వం కొత్తమీ కాదు. స్టార్స్ తనయులు హీరోలుగా మారడం కామన్. మహేష్‌బాబు, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్...ఇలా చెప్పుకుంటూ పోతే వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కథానాయకుల లిస్ట్ చాలానే ఉంటుంది. స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వారసులే తప్పితే వారసురాళ్లు మాత్రం ఎవరూ కెమెరా ముందుకు రాలేదు. స్టార్ హీరోల కూతుళ్లను హీరోయిన్లుగా అభిమానులు చూడలేరనే అపోహ చాలా కాలంగా ఉంది. మంచు లక్ష్మితో పాటు మరికొందరు వారసురాళ్లు యాక్టర్లుగా మారిన సక్సెస్ కాలేకపోయారు.
ప్రస్తుతం ట్రెండ్ మారింది. అగ్ర హీరోల కూతుళ్లు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోన్నారు. తెర ముందు కాకుండా తెర వెనుక ఉంటూ స్టార్ డాటర్స్ అదరగొడుతోన్నారు. ప్రొడ్యూసర్లుగా రాణిస్తున్నారు.
మెగా డాటర్...
మన శంకర వరప్రసాద్‌గారు మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 375 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకుంది. ఈ సినిమాతో మెగాస్టార్‌కు ఇండస్ట్రీ హిట్టు ఇచ్చిన ప్రొడ్యూసర్ మరెవరో కాదు ఆయన కూతురు సుస్మిత కొణిదెల. సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల మన శంకర వరప్రసాద్‌గారును నిర్మించింది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో సొంతంగా బ్యానర్ నెలకొల్పిన సుస్మిత మన శంకర వరప్రసాద్‌గారు కంటే ముందు కొన్ని చిన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రొడ్యూస్ చేసింది. తండ్రి చిరంజీవి సినిమాతో నిర్మాతగా తొలి సక్సెస్ అందుకుంది.
నిహారిక కొణిదెల...
మెగా ఫ్యామిలీ నుంచి సుస్మితతో పాటు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల కూడా ప్రొడ్యూసర్‌గా రాణిస్తోంది. యాక్టర్‌గా సక్సెస్ కాలేకపోయిన నిహారిక కమిటీ కుర్రాళ్లు మూవీతో నిర్మాతగా మాత్రం తొలి ప్రయత్నంలోనే హిట్టు అందుకుంది. నిహారికకు డబ్బులతో పాటు అవార్డులను ఈమూవీతెచ్చిపెట్టింది. కమిటీ కుర్రాళ్లు తర్వాత రాకస పేరుతో ఓ హారర్ పాంటసీ సినిమాను నిర్మించింది నిహారిక. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్నయ్య వరుణ్‌తేజ్‌తో తన బ్యానర్‌లోనే ఓ సినిమాను నిర్మించేందుకు నిహారిక సన్నాహాలు చేస్తుందట. ఈ మూవీకి కమిటీ కుర్రాళ్లు డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.
నందమూరి తేజస్విని...
మెగా డాటర్స్ బాటలోనే బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని కూడా అడుగులు వేస్తోంది. అఖండ 2 సినిమాకు తేజస్విని ఓ నిర్మాతగా వ్యవహరించింది. అంతే కాకుండా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో ప్రొడ్యక్షన్ వ్యవహారాలను తానే దగ్గరుండి చూసుకుంది. ఆదిత్య 369 కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఆదిత్య 999 మూవీని నందమూరి తేజస్విని తన సొంత బ్యానర్‌లో నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రవితేజ ఫ్యామిలీ నుండి...
రవితేజ కూతురు మోక్షద భూపతిరాజు కూడా ప్రొడ్యూసర్‌గా మారే ప్రయత్నాల్లో ఉందట. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఓటీటీ మూవీ తక్షకుడుకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది. భవిష్యత్తులో రవితేజ హోమ్ బ్యానర్ ఆర్టీ టీమ్ వర్క్స్ బాధ్యతలను మోక్షద స్వీకరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దివంగత టాలీవుడ్ అగ్ర హీరో కృష్ణ కూతురు, మహేష్‌బాబు సోదరి మంజుల కూడా ప్రొడ్యూసర్‌గా చాలానే సినిమాలు చేసింది. పొకిరి, ఏ మాయ చేశావేతో పాటు మరికొన్ని సినిమాలతో విజయాలను అందుకుంది.
రజనీకాంత్ కూతుళ్లు...
రజనీకాంత్ కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య కూడా ఇండస్ట్రీలోని రాణిస్తున్నారు. ఐశ్వర్య డైరెక్టర్‌గా త్రీ, లాల్ సలామ్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. సౌందర్య కూడా గ్రాఫిక్ డిజైనర్‌గా, ప్రొడ్యూసర్‌గా ప్రతిభను చాటుకుంటోంది. ఆమె నిర్మించిన విత్ లవ్ మూవీ ఈ వారమే థియేటర్లలో రిలీజైంది. అభిషన్ జీవంత్, అనస్వర రాజన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






