Niharika Konidela | మెగా డాటర్ నిహారిక కొణిదెల కొత్త బిజినెస్
ప్రొడ్యూసర్‌గా కమిటీ కుర్రాళ్లు, రాకస సినిమాలతో పెద్ద విజయాలను అందుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. సొంతంగా మ్యూజిక్ సంస్థను ప్రారంభించింది. ఆ సంస్థ పేరు ఏదంటే?
Entertainment | Published On Nov 23, 2026, 4.30 pm IST
Niharika Konidela | కమిటీ కుర్రాళ్లుతో నిర్మాతగా తొలి అడుగులోనే పెద్ద విజయాన్ని అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల . యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు నేషనల్ అవార్డులతో పాటు అనేక పురస్కారాలు దక్కించుకుంది. నిహారికకు భారీగా డబ్బులు తెచ్చిపెట్టింది.
మ్యూజిక్ సంస్థ....
ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉన్న నిహారిక తాజాగా కొత్త బిజినెస్‌ను మొదలుపెట్టింది. పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ పేరుతో సొంతంగా మ్యూజిక్ లేబుల్ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థపై తొలి ప్రయత్నంగా తాను నిర్మిస్తున్న పాకెట్ రాకెట్స్ సినిమా ఆల్బమ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు నిహారిక ప్రకటించింది. పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ లేబుల్‌పై భవిష్యత్తులో ఇతర బ్యానర్లలో వచ్చిన సినిమాల ఆల్బమ్స్‌ను రిలీజ్ చేస్తామని నిహారిక వెల్లడించింది.
జేడీ చక్రవర్తి....
పాకెట్ రాకెట్స్ సినిమాలో త్రినాథ్ వర్మ, శ్రియా కొంతం, నిర్మల్, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. గ్యానీ మ్యూజిక్ అందించిన ఈ మూవీ డిసెంబర్ 11న రిలీజ్ కాబోతుంది.
వెబ్‌సిరీస్....
2015లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది నిహారిక. ఈ బ్యానర్‌పై తొలుత ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. ఆ తర్వాత ‘నాన్న కూచి’, ‘మ్యాడ్ హౌస్’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘హలో వరల్డ్’, ‘బెంచ్ లైఫ్’ వెబ్‌సిరీస్‌లతో నిర్మాతగా మెప్పించింది. అనంతరం ‘కమిటీ కుర్రోళ్లు’ , ‘రాకాస’ సినిమాలతో ప్రొడ్యూసర్‌గా వెండితెరపై పెద్ద విజయాలను అందుకుంది. ప్రస్తుతం పాకెట్ రాకెట్స్‌తో పాటు సోదరుడు వరుణ్‌తేజ్‌తో బరి సినిమాలు చేస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sobhita Dhulipala | లిప్‌లాక్‌తో నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ చెప్పిన శోభిత
నవంబర్ 23, 2026

Vishnu Manchu | బర్త్‌డే సర్ప్రైజ్ – కొత్త సినిమాను అనౌన్స్‌చేసిన మంచు విష్ణు – డైరెక్టర్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్
నవంబర్ 23, 2026

Virosh | అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్లో విరోష్ – ఫొటోలు చూశారా?
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Bandi Sanjay | మోదీ నిప్పులాంటోడు.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్..
- ●Ayodhya To Janakpur | ఇక అయోధ్య నుంచి జనక్పూర్కి నేరుగా రైలు సర్వీసు.. కీలక వివరాలు ఇవే
- ●Shubman Gill | సలైవా వాడకంపై బ్యాన్ ఎత్తేయండి.. ఐసీసీకి గిల్ రిక్వెస్ట్..!
- ●Telangana Gold Man IT Raid | తెలంగాణ 'గోల్డ్ మ్యాన్' కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్
- ●Motkupalli Narasimhulu | రేవంత్ రెడ్డికి దళితులంటే చులకన భావం : మోత్కుపల్లి నర్సింహులు
- ●Etala Rajendar | రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు అమ్మనివ్వం.. అవి ప్రజావసరాలకే ఉండాలి

Bandi Sanjay | మోదీ నిప్పులాంటోడు.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్..

Ayodhya To Janakpur | ఇక అయోధ్య నుంచి జనక్పూర్కి నేరుగా రైలు సర్వీసు.. కీలక వివరాలు ఇవే

Shubman Gill | సలైవా వాడకంపై బ్యాన్ ఎత్తేయండి.. ఐసీసీకి గిల్ రిక్వెస్ట్..!

Telangana Gold Man IT Raid | తెలంగాణ 'గోల్డ్ మ్యాన్' కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్



