త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | వార‌ణాసి నుంచి ప్రియాంక చోప్రా బ‌ర్త్‌డే ట్రీట్ – మ‌హేష్ సినిమా కోసం గ్లోబ‌ల్ స్టార్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?

ప్రియాంక చోప్రా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వార‌ణాసి నుంచి స్పెష‌ల్ అప్‌డేట్‌ను రాజ‌మౌళి అభిమానుల‌తో పంచుకున్నారు. ప్రియాంక చోప్రా ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. కాగా వార‌ణాసి కోసం ప్రియాంక చోప్రా 30 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Jul 18, 2026, 2.50 pm IST

Priyanka Chopra | వార‌ణాసి నుంచి ప్రియాంక చోప్రా బ‌ర్త్‌డే ట్రీట్ – మ‌హేష్ సినిమా కోసం గ్లోబ‌ల్ స్టార్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?
Advertisement

Priyanka Chopra | మ‌హేష్‌బాబు హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న వార‌ణాసి కోసం ఇండియ‌న్ ఫ్యాన్స్‌తో పాటు హాలీవుడ్ ప్రేక్ష‌కులు సైతం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

హైద‌రాబాద్‌లో షూటింగ్‌...

పురాణాల‌కు టైమ్ ట్రావెల్‌, యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వార‌ణాసిని తెర‌కెక్కిస్తోన్నారు. ప్ర‌స్తుతం ఈ భారీ బ‌డ్జెట్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. హైద‌రాబాద్‌లో వేసిన స్పెష‌ల్ సెట్స్‌లో మ‌హేష్‌బాబుతో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు రాజ‌మౌళి. ఈ సినిమాలో శ్రీరాముడిగా మ‌హేష్‌బాబు క‌నిపించ‌బోతున్నారు. రుద్ర‌గా మ‌రో మాస్ రోల్ చేస్తున్నారు. మ‌హేష్ కెరీర్‌లోనే మోస్ట్ ప్రెస్టిజీయ‌స్ సినిమాగా వార‌ణాసి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ప్రియాంక చోప్రా బ‌ర్త్‌డే స్పెష‌ల్‌....

ప్రియాంక చోప్రా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ రాజ‌మౌళితో పాటు మ‌హేష్‌బాబు ఆమెకు స్పెష‌ల్‌గా విషెస్ చెప్పారు. వార‌ణాసి షూటింగ్‌లో ప్రియాంక చోప్రా సంద‌డి చేస్తోన్న‌ రెండు ఫొటోల‌ను రాజ‌మౌళి అభిమానుల‌తో పంచుకున్నారు. ఓ ఫొటోలో ఆనందంతో సంబ‌రాలు చేసుకుంటూ ప్రియాంక క‌నిపిస్తోంది. మ‌రో ఫొటోలో ఇంటెన్స్ లుక్‌లో సీరియ‌స్‌గా ఉంది. ఈ రెండు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. మందాకిని న‌వ్వితే అందం...న‌వ్వ‌క‌పోతే నిప్పు క‌ణిక అంటూ ఈ ఫొటోల‌కు రాజ‌మౌళి క్యాప్ష‌న్ ఇచ్చారు. మా ఒకే ఒక్క మందాకినికి హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ మ‌హేష్‌బాబు సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ముప్పై కోట్ల రెమ్యూన‌రేష‌న్‌....

వార‌ణాసి మూవీ కోసం ప్రియాంక చోప్రా 30 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. తెలుగులో ఓ సినిమా కోసం హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా వార‌ణాసితో రికార్డ్ క్రియేట్ చేసింది. వార‌ణాసి మూవీకి కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న వార‌ణాసి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Advertisement
Advertisement