త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinath Maganti | విడుద‌ల‌కు ముందు ట్రోలింగ్ – ఇప్పుడు ప్ర‌శంస‌లు

ఈ న‌గ‌రానికి ఏమైంది రిలీజ్‌కు ముందు కార్తీక్ పాత్ర‌కు తాను సెట్ట‌వ్వ‌న‌ని చాలా మంది ట్రోల్ చేశార‌ని శ్రీనాథ్ మాగంటి అన్నారు. సినిమా విడుద‌లైన త‌ర్వాత సుశాంత్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ చేశానంటూ ప్ర‌శంసిస్తున్నార‌ని తెలిపారు. త‌రుణ్ భాస్క‌ర్‌కు కూడా త‌న న‌ట‌న‌ విష‌యంలో అనుమానాలు ఉండేవంటూ శ్రీనాథ్ కామెంట్లు చేశాడు.

N

Entertainment | Published On Nov 23, 2026, 7.19 pm IST

Srinath Maganti | విడుద‌ల‌కు ముందు ట్రోలింగ్ – ఇప్పుడు ప్ర‌శంస‌లు
Advertisement

Srinath Maganti | త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాలో కార్తీక్ పాత్ర‌లో సాయిసుశాంత్ న‌టించాడు. నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ఈ న‌గ‌రానికి ఏమైంది సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈఎన్ఈ రిపీట్‌లో మాత్రం ఈ రోల్‌లో సాయిసుశాంత్ ప్లేస్‌లో శ్రీనాథ్ మాగంటి క‌నిపించాడు. వ్యక్తిగత కారణాలు, వ్యాపారాలపై దృష్టి పెట్టడం సాయిసుశాంత్ సీక్వెల్ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో సీక్వెల్‌లోకి శ్రీనాథ్ మాగంటి ఎంట్రీ ఇచ్చాడు.

మొద‌ట్లో విమ‌ర్శ‌లు...

ఈ న‌గ‌రానికి ఏమైంది స‌క్సెస్‌లో కార్తీక్ పాత్ర కీల‌కంగా నిలిచింది. ఈ రోల్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి ముఖ్య‌మైన పాత్రలో శ్రీనాథ్ మాగంటి క‌నిపించ‌నున్నాడ‌ని మూవీ టీమ్ అనౌన్స్‌చేసిన‌ట్లు మొద‌ట్లో చాలానే విమ‌ర్శ‌లొచ్చాయి. రాంగ్ ఛాయిస్ అంటూ కామెంట్లు పెట్టారు. యాక్టింగ్‌, కామెడీ టైమింగ్ విష‌యంలో సాయిసుశాంత్‌ను మ్యాచ్ చేస్తాడా?లేదా? అనే అనుమానాలు అంద‌రిలో మొద‌ల‌య్యాయి.

డైల‌మా...

త‌రుణ్ భాస్క‌ర్ శ్రీనాథ్ ఎంపిక విష‌యంలో డైల‌మాలో ప‌డ్డారు. ఫస్ట్ డే షూటింగ్ రోజు ఒక వేళ శ్రీనాథ్ మాగంటి కార్తీక్ పాత్రలో ఇమడకపోయినా... అత‌డి న‌ట‌న‌ సంతృప్తి కలగకపోయినా ఇంకో ఆప్షన్‌కి వెళ్దామన్న కోణంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉన్నారు. కానీ ఆ విషయం శ్రీనాథ్‌కు చెబితే టెన్ష‌న్ ప‌డ‌తాడ‌ని అత‌డి ద‌గ్గ‌ర దాచిపెట్టారు . ఈ విష‌యాన్ని సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఈ టాలీవుడ్ యంగ్ హీరో స్వ‌యంగా ప్ర‌క‌టించారు.ఆడియెన్స్‌తో పాట మూవీ టీమ్ అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ కార్తీక్ పాత్రకు శ్రీనాథ్ న్యాయం చేశాడు. సుశాంత్‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా న‌టించాడు.

ల‌వ‌ర్ బాయ్‌గా....

ఈఎన్ఈ రిపీట్ మూవీలో ల‌వ‌ర్‌బాయ్‌గా, స్నేహానికి ప్రాణ‌మిచ్చే సినిమాటోగ్రాఫ‌ర్‌గా రెండు వేరియేష‌న్స్‌లో సాగే పాత్ర‌లో నాచుర‌ల్ ప‌ర్ఫార్మెన్స్‌ను క‌న‌బ‌రిచాడు శ్రీనాథ్‌. శివాత్మిక‌తో అత‌డి ల‌వ్ ట్రాక్ సీక్వెల్‌కు హైలైట్‌గా నిలిచింది. రిలీజ్‌కు ముందు ట్రోలింగ్‌ చేసిన వారంతా ఇప్పుడు త‌న‌న యాక్టింగ్ బాగుందంటున్నార‌ని శ్రీనాథ్ మాగంటి అన్నారు ‘నా నటనతో బాగాలేక‌పోతే కార్తీక్ పాత్ర కోసం మరొక నటుడిని తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావించారు. కానీ ఈ రోజు సినిమా విడుదలైంది. నేను ఇందులో భాగమయ్యాను. అదే నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు’ అని శ్రీనాథ్ ఎమోషనల్ అవుతున్నాడు.

ఈఎన్ఈ రిపీట్ కంటే ముందు హిట్‌, యానిమ‌ల్‌, ల‌క్కీ భాస్క‌ర్‌తో పాటు ప‌లు సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. మ్యాన్ష‌న్ హౌజ్ మ‌ల్లేష్ వంటి చిన్న సినిమాల్లో హీరోగా న‌టించాడు.

 

Advertisement
Advertisement