త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sree Vishnu | “ఫ్యామిలీ ప్యాక్” టీజ‌ర్ రిలీజ్ – సంక్రాంతి బ‌రిలో శ్రీవిష్ణు కామెడీ మూవీ

సంక్రాంతి రేసులో శ్రీవిష్ణు మూవీ నిల‌వ‌బోతుంది. అత‌డు హీరోగా న‌టించిన ఫ్యామిలీ ప్యాక్ టీజ‌ర్‌సోమ‌వారం రిలీజైంది. ఫ‌న్, ఫ్యామిలీ అంశాల‌తో ఈ టీజ‌ర్ ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగింది. ఫ్యామిలీ ప్యాక్ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ క‌న్ఫామ్ చేశారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న శ్రీవిష్ణు సినిమా థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Nov 23, 2026, 8.14 pm IST

Sree Vishnu | “ఫ్యామిలీ ప్యాక్” టీజ‌ర్ రిలీజ్ – సంక్రాంతి బ‌రిలో శ్రీవిష్ణు కామెడీ మూవీ
Advertisement

Sree Vishnu |సంక్రాంతి బ‌రిలో స్టార్స్ సినిమాల‌తో పోటీప‌డ‌బోతున్నాడు శ్రీవిష్ణు. అత‌డు హీరోగా న‌టిస్తున్న ఫ్యామిలీ ప్యాక్ పండుగ‌కు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది. ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాక్షి మ‌డోల్క‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

టీజ‌ర్ రిలీజ్‌...

సోమ‌వారం ఫ్యామిలీ ప్యాక్ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. శ్రీవిష్ణు శైలి కామెడీ, పంచ్‌ల‌తో ఆద్యంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా ఈ టీజ‌ర్ సాగింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించ‌బోతున్న‌ట్లు టీజ‌ర్‌లో చూపించారు. బాధ్యతగా ఉండే ఫ్యామిలీ మ్యాన్‌లా కాకుండా, తన కుటుంబం గురించి అస్స‌లు పట్టించుకోని స్వార్థపరుడిగా డిఫ‌రెంట్‌గా అత‌డి క్యారెక్ట‌ర్‌ను ప్ర‌జెంట్ చేయ‌బోతున్నారు డైరెక్ట‌ర్‌. శ్రీవిష్ణు ఇంట్లో ఓ వైపు బోరబండ, మరోవైపు బంజారాహిల్స్ అంటూ రెండు ప్రాంతాల లైఫ్ స్టయిల్ చూపించిన తీరు ఫ‌న్నీగా ఉంది.

కామెడీ టైమింగ్‌...

ఆ పోలీస్ ఆఫీస‌ర్ లైఫ్‌లోకి తన పై అధికారి కూతురు ప్రియురాలిగా రావడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఆ ప‌రిస్థితుల్లో అత‌డికి ఎదురైన ఇబ్బందులు, అనుభ‌వాల‌తో టీజ‌ర్ న‌వ్వించింది. శ్రీ విష్ణు తన డిఫరెంట్ యాటిట్యూడ్, బ్యాడీ లాంగ్వెజ్‌, కామెడీ టైమింగ్ తో అద‌ర‌గొట్ట‌బోతున్న‌ట్లు టీజ‌ర్ ద్వారా మేక‌ర్స్ హింట్ ఇచ్చారు. శ్రీవిష్ణు, న‌రేష్, సుద‌ర్శ‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్లు టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి.

జ‌న‌వ‌రి 14న‌....

ఫ్యామిలీ ప్యాక్ సినిమాలో శ్రీవిష్ణు తండ్రిగా వీకే న‌రేష్ క‌నిపించ‌బోతుండ‌గా... తల్లిగా అభిరామి, తమ్ముడిగా బుల్లిరాజు క‌నిపించ‌బోతున్నారు. సాక్షి తండ్రిగా మురళీ శర్మ న‌టించ‌నున్నారు. ఈ టీజ‌ర్‌లో స‌త్య‌, వెన్నెల‌కిషోర్ పాత్ర‌ల‌ను మాత్రం మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా త‌ర్వాత శ్రీవిష్ణు, రామ్ అబ్బ‌రాజు కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా ఇది. ఫ్యామిలీ ప్యాక్‌కు భాను భోగవరపు, నందు సావిరిగాన కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
సంక్రాంతి కానుక‌గా 2027 జ‌న‌వ‌రి 14న శ్రీవిష్ణు మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌....

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘సామజవరగమన’ విజయవంతమైన తర్వాత రామ్ అబ్బరాజుతో మరో సినిమా చేయాలనుకున్నా. ఒక మంచి కథ దొరికితే కలిసి పనిచేద్దామని ఎదురుచూశా. అలాంటి సమయంలో ఈ కథ వచ్చింది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో ఒక కొత్త యాంగిల్ ట‌చ్ చేశాం. సుదర్శన్‌తో నేను చేసిన సినిమాలన్నీ హిట్టే. ఈ సినిమా కూడా ఆ లిస్ట్‌లో చేరుతుంద‌ని నమ్ముతున్నా. సత్య కామెడీ అదిరిపోతుంది. వెన్నెల కిషోర్ గారి ట్రాక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది" అని అన్నారు.

Advertisement
Advertisement