Telugu OTT | ఓటీటీలోకి తెలుగు ఫాంటసీ కామెడీ మూవీ – సూర్య కరుప్పుతో కంపేరిజన్స్
శ్రీకాంత్ హీరోగా నటించిన సోషియా ఫాంటసీ కామెడీ మూవీ మిస్టర్ మిడిల్ క్లాస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఆగస్ట్ 19న ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో లయ హీరోయిన్‌గా నటించింది
Entertainment | Published On Aug 18, 2026, 5.00 pm IST
Telugu OTT |టాలీవుడ్ సీనియర్ హీరోలు శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ గత నెలలో థియేటర్లలో రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. లయ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించాడు.
ఆహా ఓటీటీలో...
ఫాంటసీ కామెడీగా రూపొందిన మిస్టర్ మిడిల్ క్లాస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 19 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించింది. శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్‌తో పాటు అలీ, రఘుబాబు, వెన్నెలకిషోర్ లాంటి కమెడియన్లు ఉన్నా మిస్టర్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులను నవ్వించలేకపోయింది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో పాటు మైథాలజీ మూవీలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులు ఎక్కువ కావడంపై విమర్శలొచ్చాయి. రిలీజైన వారంలోనే థియేటర్లలో కనిపించకుండాపోయింది.
కరుప్పుతో కంపేరిజన్స్...
ఇటీవల రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సూర్య కరుప్పుతో పాటు యమలీల వంటి సూపర్ హిట్ సినిమాల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కినట్లు కంపేరిజన్స్ వచ్చాయి. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా రాజేంద్రప్రసాద్ నటించాడు.
వెంకటరమణ కష్టాలు...
వెంకటరమణ ఓ టిఫిన్ సెంటర్ నడుపుతుంటాడు. రెస్టారెంట్ పెడితే బాగా డబ్బులు వస్తాయని అప్పులు తెస్తాడు. కానీ రెస్టారెంట్ అనుకున్నంతగా నడవదు. అప్పులు పెరిగిపోయి అమ్మేస్తాడు. అదే రెస్టారెంట్‌లో వర్కర్‌గా పనిచేస్తుంటాడు. వెంకటరమణ కష్టాలను చలించిన వెంకటేశ్వరస్వామి అతడికి ఓ బుక్ ఇస్తాడు. అందులో ఏం రాస్తే అది జరుగుతుందని అంటాడు? ఆ బుక్ వల్ల వెంకటరమణ కష్టాలు తొలగిపోయాయా? దేవుడు ప్రత్యక్షమైన తర్వాత వెంకటరమణ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu OTT | సైలెంట్‌గా ఓటీటీలో వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ – భార్యాభర్తల మధ్యలోకి లేడీ సైకో ఎంటరైతే!
ఆగస్టు 14, 2026

Megha Akash | ఒకే సారి ఓటీటీలోకి వచ్చిన మేఘా ఆకాష్ రెండు తెలుగు సినిమాలు
ఆగస్టు 13, 2026

Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే – స్ట్రీమింగ్ ఎందులో …ఎప్పుడంటే?
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●ICC Player of the Month | వెస్టిండీస్ ప్లేయర్ల జోరు.. గ్రీవ్స్, హేలీ మాథ్యూస్‌కు ఐసీసీ అవార్డులు
- ●FDI | ఎఫ్‌డీఐలకి భారీ ఊతం.. రూ.15 వేల కోట్లకు పెరగనున్న పరిమితి..
- ●Ramchandar Rao | కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టండి
- ●Suryapet | కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. బ్యాంకు మేనేజర్ అరెస్ట్
- ●Harsh Goenka | దాబేలీ.. బర్గర్ కంటే చాలా రుచికరంగా ఉంటుంది
- ●Harish Rao | లైసెన్స్డ్ సర్వేయర్లకు జీతాలేవీ..? అడిగితే అరెస్టులు చేస్తారా..?

ICC Player of the Month | వెస్టిండీస్ ప్లేయర్ల జోరు.. గ్రీవ్స్, హేలీ మాథ్యూస్‌కు ఐసీసీ అవార్డులు

FDI | ఎఫ్‌డీఐలకి భారీ ఊతం.. రూ.15 వేల కోట్లకు పెరగనున్న పరిమితి..

Ramchandar Rao | కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టండి

Suryapet | కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. బ్యాంకు మేనేజర్ అరెస్ట్



