Paradise Movie | హీరో నానితో గొడవలు నిజమే – ప్యారడైజ్ డైరెక్టర్ కామెంట్స్
ప్యారడైజ్ షూటింగ్‌తో నానితో జరిగిన గొడవలపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర కామెంట్స్ చేశాడు. షూటింగ్‌లో నాని తనను తిట్టింది నిజమేనని అన్నారు. తాను నానిని కొన్ని మాటలు అన్నానని చెప్పాడు. ప్యారడైజ్ సక్సెస్ మీట్‌లో శ్రీకాంత్ ఓదెల చేసిన కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Sep 26, 2026, 7.35 pm IST
Paradise Movie | ప్యారడైజ్ షూటింగ్‌లో నానితో తనకు గొడవలు జరిగింది నిజమేనని అన్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ప్యారడైజ్ ఇటీవల రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో గుర్తింపు కోసం అణగారిన వర్గం సాగించిన పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ రెండు రోజుల్లోనే 114 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది. ప్యారడైజ్ మూవీ సక్సెస్ మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో నానితో విభేదాలపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రియాక్ట్ అయ్యాడు.
తిట్టాడు...కొట్టాడు...
"ప్యారడైజ్ షూటింగ్‌లో హీరో నానికి నాపై కోపం వచ్చిందని వార్తలొచ్చాయి. నన్ను తిట్టాడని, కొట్టాడని ప్రచారం జరిగింది. నాని మాటలతో నేను అలిగి షూటింగ్ నుంచి వెళ్లిపోయానని, మాకిద్దరికి గొడవలు జరిగాయని రాశారు. అందులో వాస్తవం ఉంది. నాని నన్ను తిట్టింది నిజమే. నేను ఆయన్ని కొన్ని మాటలు అన్నాను. షూటింగ్‌లో ఆయన నన్ను భరించారు. నానికి అంతకుమించి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ సినిమాలోకి ఆయనే నన్ను తీసుకొచ్చి పెట్టారు కాబట్టే మోశారు. ఈ ప్రాసెస్‌లో తన్నుకుంటాం...కొట్టుకుంటాం...ముద్దుపెట్టుకుంటాం...మూతులు నాక్కుంటాం..అది మా ఇష్టం" అని శ్రీకాంత్ ఓదెల కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
పది టేక్స్ తీసుకున్నా....
ప్యారడైజ్ సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలపై సీనియర్ హీరో మోహన్‌బాబు ప్రశంసలు కురిపించారు. . యాభై ఏళ్ల నట ప్రయాణంలో ఇలాంటి భయంకరమైన పాత్ర చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. "ఇంత భయంకరంగా నా పాత్రను డైరెక్టర్ స్క్రీన్‌పై చూపిస్తాడంటే ప్యారడైజ్ సినిమాను ఒప్పుకొనేవాడిని కాదు. షర్ట్ లేకుండా నాతో సీన్లు చేయించారు. నా జీవితంలో ఓ సీన్ కోసం ఫస్ట్ టైమ్ పది టేకులు ఈ సినిమాలోనే తీసుకున్నా" అని మోహన్‌బాబు అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | ప్యారడైజ్ సినిమా చూడబోతున్న కేటీఆర్ – చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్తున్నానంటూ ట్వీట్
సెప్టెంబర్ 26, 2026

Mrunal Thakur | బ్లడీ రోమియో డబుల్ ధమాకా – ఇద్దరు హీరోయిన్లతో నాచురల్ స్టార్ రొమాన్స్!
సెప్టెంబర్ 25, 2026

Paradise Collections | ప్యారడైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ – రికార్డులు తిరగరాసిన నాచురల్ స్టార్ – నైజాంలో హయ్యెస్ట్
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Manmohan Singh | భారతదేశం గర్వించదగ్గ జాతిరత్నం మన్మోహన్ : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Bangkok | బ్యాంకాక్ టూర్‌కి ప్లాన్ చేస్తున్నారా? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి
- ●Tollywood | టైటిల్ వివాదంలో నివిన్ పౌలీ సంచారి - ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించనున్న టాలీవుడ్ డైరెక్టర్ ?
- ●Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం
- ●Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
- ●KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం

Manmohan Singh | భారతదేశం గర్వించదగ్గ జాతిరత్నం మన్మోహన్ : సీఎం రేవంత్‌రెడ్డి

Bangkok | బ్యాంకాక్ టూర్‌కి ప్లాన్ చేస్తున్నారా? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి

Tollywood | టైటిల్ వివాదంలో నివిన్ పౌలీ సంచారి - ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించనున్న టాలీవుడ్ డైరెక్టర్ ?

Yadadri Thermal Power Plant | యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రికార్డు స్థాయి కరెంట్ ఉత్పత్తి: రోజుకు 140 మిలియన్ యూనిట్లే లక్ష్యం



