SYG Movie | షాకింగ్ లుక్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో
సంబరాల ఏటి గట్టు మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. బ్రిటీషు అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. శ్రీకాంత్ బర్త్‌డే సందర్భంగా సోమవారం రిలీజ్ చేసిన పోస్టర్‌లో శ్రీకాంత్ గుర్తుపట్టలేని లుక్‌లో కనిపించారు.
Entertainment | Published On Mar 23, 2026, 8.38 pm IST
SYG Movie | టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గుర్తుపట్టలేనివిధంగా మారిపోయారు. సంబరాల ఏటిగట్టు మూవీ కోసం తన లుక్, గెటప్ మార్చేశారు. సాయిదుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీకాంత్ బర్త్‌డే సందర్భంగా సంబరాల ఏటిగట్టు మూవీ నుంచి అతడి లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
రా అండ్ రస్టిక్...
ఈ పోస్టర్‌లో గుబురుగా పెరిగిన గడ్డం, సైనికులు ధరించే దస్తుల్లో కంప్లీట్ రా అండ్ రస్టిక్ లుక్‌లో శ్రీకాంత్ కనిపించారు . డ్రెస్ మొత్తం చిరిగిపోయి ఉండటం...ఆ డ్రెస్‌పై సైనికుల ధైర్యానికి గుర్తుగా ఇచ్చే మెడల్స్ కనిపించడం ఆసక్తిని పంచుతోంది. బ్రిటీషు అనే పాత్రలో శ్రీకాంత్ నటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గుర్తుపట్టలేని విధంగా ఈ పోస్టర్‌లో శ్రీకాంత్ లుక్ ఉండటం ఆసక్తిని పంచుతోంది. శ్రీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో డిఫరెంట్ క్యారెక్టర్‌గా సంబరాల ఏటిగట్టు మూవీ నిలవబోతుందని సమాచారం. కథను మలుపుతిప్పే క్యారెక్టర్ అని సమాచారం.
హనుమాన్ నిర్మాతలు...
సంబరాల ఏటిగట్టు మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హనుమాన్‌తో పెద్ద విజయాన్ని అందుకున్న కే నిరంజర్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దక్షిణాదికి చెందిన టాప్ టెక్నికల్ టీమ్ఈ సినిమాకు పని చేస్తున్నారు.. సినిమాటోగ్రఫీని వెట్రివేల్ పళనిసామి అందిస్తుండగా, సంగీతాన్ని బి. అజనీష్ లోకనాథ్ సమకూరుస్తున్నారు. నవీన్ విజయకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష ఒకే రోజు రిలీజ్ కాబోతుంది.
బ్రో మూవీతో చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు సాయిదుర్గాతేజ్. పవన్ కళ్యాణ్ మరో హీరోగా నటించిన ఈ మూవీకి 2023లో రిలీజైంది. దాదాపు మూడేళ్ల తర్వాత సంబరాల ఏటిగట్టుతో ప్రేక్షకల ముందుకు రాబోతున్నాడు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






