Sreevishnu | శ్రీవిష్ణు ఫ్యామిలీ ప్యాక్ – సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ సినిమాలతో పోటీ
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు నిలవబోతున్నాడు. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు ఫ్యామిలీ ప్యాక్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Sep 14, 2026, 1.02 pm IST
Sreevishnu | 2027 సంక్రాంతి పోరు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వెంకటేష్, చిరంజీవితో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలు పండుగకు థియేటర్లలోకి రాబోతున్నాయి. సంక్రాంతి రేసులో మొత్తం ఆరు సినిమాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి "కాకా", వెంకటేష్, అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీ "జనవరి 12 విడుదల"తో పాటు ప్రశాంత్ వర్మ "మహాకాళి" రిలీజ్ డేట్స్ ఖరారయ్యాయి. తాజాగా సంక్రాంతి బరిలో శ్రీవిష్ణు కూడా నిలవబోతున్నాడు.
ఫ్యామిలీ ప్యాక్...
శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు "ఫ్యామిలీ ప్యాక్" అనే పేరు పెట్టారు. కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో బిల్డింగ్ పై నుంచి కరెన్సీ నోట్ల వర్షం కురుస్తుంది. వాటి మధ్య శ్రీవిష్ణుతో పాటు ప్రధాన పాత్రధారులు కనిపిస్తున్నారు. సంక్రాంతికి ఫ్యామిలీ ప్యాక్ థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సామజవరగమనా తర్వాత...
సామజవరగమనా తర్వాత శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఫ్యామిలీ ప్యాక్ మూవీలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అభిరామి, నరేష్, వెన్నెలకిషోర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.
ఫ్యామిలీ ప్యాక్‌తో పాటు కామ్రేడ్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు శ్రీవిష్ణు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ అక్టోబర్ 9 థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●BAPS | బాప్స్ సంస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరుస వివాదాల ఉప్పెన
- ●Monsoon Diseases | వర్షాకాలంలో తరచూ వచ్చే 8 రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఇవే.. వీటితో జాగ్రత్త..
- ●Rashmika Mandanna | బేబీ బంప్‌తో రష్మిక - రణబాలికి ప్యాకప్ చెప్పిన జయమ్మ
- ●Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ - ప్రమోషన్స్ షురూ
- ●Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. పెట్టుబడిదారులకు నిపుణల అలర్ట్..
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. రేపు బ్లడ్ బాత్ తప్పదా..?

BAPS | బాప్స్ సంస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరుస వివాదాల ఉప్పెన

Monsoon Diseases | వర్షాకాలంలో తరచూ వచ్చే 8 రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఇవే.. వీటితో జాగ్రత్త..

Rashmika Mandanna | బేబీ బంప్‌తో రష్మిక - రణబాలికి ప్యాకప్ చెప్పిన జయమ్మ

Sai Pallavi | రామాయణ నుంచి ఎట్టకేలకు సాయిపల్లవి పోస్టర్ రిలీజ్ - ప్రమోషన్స్ షురూ





