Sreeleela | శ్రీలీలకు వరుస ఫ్లాపులు..! కెరీర్‌లో అసలేం జరుగుతోంది?
Sreeleela | టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్లిన యంగ్ బ్యూటీ శ్రీలీలకు ఇప్పుడు కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది. డ్యాన్స్, ఎనర్జిటిక్ నటనతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామకు.. ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కడం లేదు. తెలుగులో వరుస పరాజయాలు పలకరించడంతో కొత్త అవకాశాల కోసం కోలీవుడ్ వైపు అడుగులు వేసింది.
Entertainment | Published On Nov 25, 2026, 6.05 pm IST
Sreeleela | టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్లిన యంగ్ బ్యూటీ శ్రీలీలకు ఇప్పుడు కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది. డ్యాన్స్, ఎనర్జిటిక్ నటనతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామకు.. ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కడం లేదు. తెలుగులో వరుస పరాజయాలు పలకరించడంతో కొత్త అవకాశాల కోసం కోలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడా అదృష్టం కలిసి రావడం లేదు. తొలి తమిళ చిత్రం ‘పరాశక్తి’ నిరాశపరిచినప్పటికీ.. అక్కడి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించిన శ్రీలీలకు తాజాగా ‘ఓం’ కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. వరుస సినిమాల ఫలితాలు ప్రతికూలంగా మారుతుండటంతో ఇప్పుడు ఆమె తదుపరి అడుగులపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కోలీవుడ్ ఆశలపై నీళ్లు..
తెలుగులో వరుసగా సినిమాలు చేసినా ఆశించిన విజయాలు దక్కకపోవడంతో శ్రీలీల తన కెరీర్ విస్తరించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్‌తో కలిసి నటించిన ‘పరాశక్తి’ ఆమెకు తొలి కోలీవుడ్ ప్రాజెక్ట్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా.. శ్రీలీల నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అక్కడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని భావించింది. కానీ రెండో సినిమా ‘ఓం’తోనూ పరిస్థితి మారలేదు. విడుదలైన తర్వాత ఈ చిత్రానికి ప్రతికూల స్పందన ఎదురవుతుండటంతో బాక్సాఫీస్ ఫలితంపై ఆసక్తి నెలకొంది. సినిమా వసూళ్లపై పూర్తి స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుత టాక్ మాత్రం ఆమెకు ఊరటనిచ్చేలా లేదు.
పాత్రపైనా విమర్శలు..
‘ఓం’ సినిమా ఫలితానికి తోడు శ్రీలీల పోషించిన పాత్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం 25 ఏళ్ల వయసున్న ఈ నటి.. తెరపై ధనుష్ భార్యగా, పదేళ్ల చిన్నారికి తల్లిగా కనిపించడంపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఆమె ఇమేజ్‌కు, ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఈ క్యారెక్టర్ భిన్నంగా ఉండటంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కథలో పాత్రకు తగినంత ప్రాధాన్యం లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పాత్రను శ్రీలీల ఎందుకు అంగీకరించిందన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇమేజ్‌కు భిన్నంగా ప్రయోగం..
శ్రీలీల అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఆమె ఎనర్జిటిక్ డ్యాన్స్, చలాకీ నటన, యూత్‌ఫుల్ పాత్రలే. ‘పెళ్లిసందడి’, ‘ధమాకా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి భిన్నమైన పాత్రలు ఎంచుకోవడం ఎంతవరకు కలిసొస్తుందన్న చర్చ మొదలైంది. నటిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ప్రయత్నం ఒకవైపు ఉన్నా.. కథలో తన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంది? ప్రేక్షకులపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఆమె కథల విషయంలో దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
రజనీ, అజిత్ సినిమాలపై ఆశలు..
వరుస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీలీలకు ఇప్పుడు చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ‘ధర్మన్’లో ఆమెకు అవకాశం దక్కింది. కమల్‌హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రజనీకాంత్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న శ్రీలీల.. ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించనుందన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు అజిత్ కుమార్‌తో జతకడుతున్న ‘డేర్‌డెవిల్’పైనా ఈ బ్యూటీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ రెండు చిత్రాలు తమిళంలో ఆమెకు బలమైన గుర్తింపును తీసుకొస్తాయని భావిస్తోంది. ఒకవైపు రజనీ వంటి సూపర్‌స్టార్‌తో నటించే అవకాశం.. మరోవైపు అజిత్ సరసన కనిపించే ఛాన్స్.. ఇలా అరుదైన అవకాశాలు చేతిలో ఉన్నప్పటికీ, వాటిని విజయాలుగా మలచుకోవాల్సిన బాధ్యత శ్రీలీలపైనే ఉంది. మరి ఈ రెండు సినిమాలతోనైనా ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేసి, తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వస్తుందేమో చూడాలి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Meenakshi Chaudhary | మరో హిట్‌కు రెడీ అయిన మీనాక్షి.. ‘వృషకర్మ’తో 2026కు గ్రాండ్ ఎండింగ్!
నవంబర్ 25, 2026

Garividi Lakshmi OTT | ఓటీటీలోకి ఉత్తరాంధ్ర జానపద గాయని బయోపిక్.. రేపటి నుంచే స్ట్రీమింగ్!
నవంబర్ 25, 2026

Megastar Chiranjeevi | సంక్రాంతి బరిలోకి మెగాస్టార్.. ఈ సారైనా ‘విశ్వంభర’ వస్తాడా?
నవంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Rinku Singh | డిసెంబర్ 4న పెళ్లి పీటలెక్కనున్న రింకూ సింగ్, ప్రియా సరోజ్.. ప్రధాని మోదీకి ఆహ్వానం
- ●Dasyam Vinay Bhaskar | బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే రౌడీయిజం, బెదిరింపులు
- ●CV Anand | ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట.. పనులను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్
- ●CM Revanth Reddy | రేపు నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 450 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ●Revanth Reddy | తెలంగాణ క్రీడాభివృద్ధికి బలమైన పునాదిగా ఖేలో ఇండియా పోటీలు: సీఎం రేవంత్ రెడ్డి
- ●Miyapur | మియాపూర్ సీఐకి నాలుగు వారాల జైలు శిక్ష.. ఎందుకంటే..?

Rinku Singh | డిసెంబర్ 4న పెళ్లి పీటలెక్కనున్న రింకూ సింగ్, ప్రియా సరోజ్.. ప్రధాని మోదీకి ఆహ్వానం

Dasyam Vinay Bhaskar | బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే రౌడీయిజం, బెదిరింపులు

CV Anand | ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట.. పనులను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

CM Revanth Reddy | రేపు నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. రూ. 450 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన



