త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | ఫ్లాపుల్లో శ్రీలీల ట్రిపుల్ హ్యాట్రిక్ – ఉస్తాద్‌తోనూ త‌ప్ప‌ని నిరాశ

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌తో ఫ్లాపుల్లో ట్రిపుల్ హ్యాట్రిక్ అందుకుంది శ్రీలీల‌. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో హీరోయిన్‌గా శ్రీలీల ప‌ద‌కొండు సినిమాలు చేస్తే అందులో తొమ్మిది డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ఉస్తాద్ ప‌రాజ‌యంతో శ్రీలీల టాలీవుడ్ కెరీర్ డైల‌మాలో ప‌డింద‌ని టాక్ వినిపిస్తోంది.

N

Entertainment | Published On Mar 23, 2026, 3.12 pm IST

Sreeleela | ఫ్లాపుల్లో శ్రీలీల ట్రిపుల్ హ్యాట్రిక్ – ఉస్తాద్‌తోనూ త‌ప్ప‌ని నిరాశ
Advertisement

Sreeleela | ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌పై శ్రీలీల బోలెడు ఆశ‌లు పెట్టుకుంది. టాలీవుడ్‌లో త‌న‌కు క‌మ్‌బ్యాక్ మూవీగా ఉస్తాద్ నిలుస్తుంద‌ని క‌ల‌లు క‌న్న‌ది. వ‌రుస ఫ్లాపుల‌కు ఈ సినిమాతో బ్రేక్ ప‌డ‌టం ఖాయ‌మ‌ని శ్రీలీల భావించింది. కానీ ఆమె ఒక‌టి త‌లిస్తే రిజ‌ల్ట్ మాత్రం మ‌రోలా వ‌చ్చింది. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ డిజాస్ట‌ర్ దిశ‌గా సాగుతోంది. ధురంధ‌ర్ 2 జోరు కార‌ణంగా రోజురోజుకు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ క‌లెక్ష‌న్స్ త‌గ్గుతూ వ‌స్తోన్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ వీకెండ్‌లో అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టిన సినిమాగా ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ నిలిచింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్‌...

దాదాపు వంద కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు 40 కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ లాభాల్లోకి అడుగుపెట్ట‌డం అనుమాన‌మేన‌ని అంటున్నారు. సింద‌

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌తో ఫ్లాపుల్లో శ్రీలీల ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టేసింది. ఇప్ప‌టివ‌ర‌కు హీరోయిన్‌గా తెలుగులో శ్రీలీల 11 సినిమాలు చేసింది. అందులో ధ‌మాకా, భ‌గ‌వంత్ కేస‌రి మిన‌హా మిగిలిన సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్‌గా నిలిచాయి. టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌తోనే ఎక్కువ‌గా జోడీ క‌ట్టింది. భారీ బ‌డ్జెట్‌, హైప్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమాలేవి ఆడియెన్స్‌ను మెప్పించ‌లేక‌పోయాయి.

కెరీర్ డైల‌మా...

ఉస్తాద్ రిజ‌ల్ట్‌తో శ్రీలీల టాలీవుడ్ కెరీర్ డైల‌మాలో ప‌డింది. ఇక తెలుగులో అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మేన‌ని అంటోన్నారు. శ్రీలీల పేరు చెబితేనే నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ట‌. డ్యాన్స్‌, ఎన‌ర్జీ, యాక్టింగ్ విష‌యంలో శ్రీలీల టాలెంట్ సూప‌ర్‌. కానీ ఎటొచ్చి ల‌క్ మాత్రం క‌లిసిరావ‌డం లేదు. శ్రీలీల సినిమా చేస్తే డిజాస్ట‌రే అనే ముద్ర ప‌డ‌టంతో ఆమెకు ఆఫ‌ర్లు ఇవ్వ‌డానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెనకడుగు వేస్తోన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

బాలీవుడ్‌కు షిప్ట్‌...

ప్ర‌స్తుతం తెలుగులో శ్రీలీల చేతిలో కొత్త సినిమాలేవి లేవు. ఉస్తాద్ తో హిట్టు కొట్టి  నెక్స్ట్ సినిమాల‌పై సంత‌కం చేయాల‌ని అనుకుంది. కానీ ఈ డిజాస్ట‌ర్‌తో డిస్క‌ష‌న్స్‌లో ఉన్న ఒక‌టి, రెండు సినిమాల ఆఫ‌ర్లు దూర‌మైన‌ట్లు స‌మాచారం.

తెలుగులో అవ‌కాశాలు లేక‌పోయినా కోలీవుడ్‌, బాలీవుడ్‌లో బిజీగా ఉంది. దాంతో టాలీవుడ్‌పై ఆశ‌లు వ‌ద‌లుకొని పూర్తిగా త‌మిళ‌, హిందీ భాష‌ల్లోకి షిప్ట‌వ్వాల‌నే ఆలోచ‌న‌లో శ్రీలీల ఉన్న‌ట్లు చెబుతోన్నారు.
ప‌రాశ‌క్తితో త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టించిన ఈ మూవీ సంక్రాంతికి రిలీజై ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా త‌మిళంలో ధ‌నుష్‌తో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకుంది.  మరోవైపు ఆషికీ 3 మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement