త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | రేపు తిరుమ‌ల శ్రీనివాసుడి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

TTD | క‌లియుగ వైకుంఠం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌. జ‌న‌వ‌రి కోటాకు చెందిన ఆర్జిత సేవా టికెట్ల‌ను (Arjitha Seva Tickets) అక్టోబ‌ర్ 19న (సోమ‌వారం) తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) విడుద‌ల చేయ‌నుంది.

G

Devotional | Published On Oct 18, 2026, 9.20 am IST

TTD | రేపు తిరుమ‌ల శ్రీనివాసుడి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Advertisement

TTD | త్రినేత్ర న్యూస్‌: క‌లియుగ వైకుంఠం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌. జ‌న‌వ‌రి కోటాకు చెందిన ఆర్జిత సేవా టికెట్ల‌ను (Arjitha Seva Tickets) అక్టోబ‌ర్ 19న (సోమ‌వారం) తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) విడుద‌ల చేయ‌నుంది. భక్తుల సౌకర్యార్థం జనవరి మాసానికి (January Quota) సంబంధించిన సుప్రభాతం (Suprabhatham), తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను సోమ‌వారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచ‌నుంది.

సేవా టికెట్ల రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో ఎంపికైన భక్తులు 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం (Kalyanotsavam), ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయ‌నుంది. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతుంది.

ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) బ్రేక్‌ దర్శనం కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా ఈ నెల 24న‌ ఉదయం 10 గంటలకు జనవరి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో కిరాయి గదుల బుకింగ్‌ కోటాను విడుదల చేస్తుంది. భక్తులు దేవ‌స్థానం వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.inలో ఆయా టికెట్లను బుక్‌ చేసుకోవ‌చ్చు.

Advertisement
Advertisement