త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | సూప‌ర్ స్టార్ సినిమాలో శ్రీలీల స్పెష‌ల్ సాంగ్ – ధ‌ర్మ‌న్‌లో ధ‌మాకా బ్యూటీ

ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్ మూవీలో ఇప్ప‌టికే ప‌లువురు పాన్ ఇండియ‌న్ స్టార్స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. తాజాగా ధ‌మాకా బ్యూటీ శ్రీలీల‌ ఈ సినిమాలో జాయినైంది. ఆమె షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో లీక‌య్యాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా స్పెష‌ల్ సాంగ్‌లో శ్రీలీల క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Oct 3, 2026, 3.47 pm IST

Sreeleela | సూప‌ర్ స్టార్ సినిమాలో శ్రీలీల స్పెష‌ల్ సాంగ్ – ధ‌ర్మ‌న్‌లో ధ‌మాకా బ్యూటీ
Advertisement

Sreeleela |  ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తోన్న ధ‌ర్మ‌న్ మూవీకి సంబంధించి రోజుకో రూమ‌ర్‌ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాకు అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాశీఖ‌న్నా, సిమ్రాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నఈ పాన్ ఇండియ‌న్ మూవీలో టాలీవుడ్ హీరో రామ్‌పోతినేని విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ధ‌ర్మ‌న్ షూటింగ్ మైసూర్‌లో జ‌రుగుతోంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ తాలూకు కొన్ని సీన్లు సోష‌ల్ మీడియాలో లీక‌య్యాయి. ఈ ఫొటోల్లో శ్రీలీల క‌నిపించ‌డం అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

స్పెష‌ల్ సాంగ్‌...

ధ‌ర్మ‌న్‌లో శ్రీలీల కూడా ఓ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీలీల న‌టిస్తుంది నిజ‌మే కానీ హీరోయిన్‌గా కాద‌ని అంటున్నారు. స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ పాట‌ను ఇటీవ‌లే ర‌జ‌నీకాంత్‌, రాశీఖ‌న్నా, రామ్‌పోతినేని, శ్రీలీల‌ల‌పై డైరెక్ట‌ర్ షూట్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ పాట‌కు సంబంధించిన విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయిన కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

మాస్ ట్యూన్‌....

ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం అనిరుధ్ మంచి మాస్ ట్యూన్‌ను కంపోజ్ చేసిన‌ట్లు స‌మాచారం. శ్రీలీల స్టెప్పులు అదిరిపోతాయ‌ని చెబుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 త‌ర్వాత మ‌రోసారి శ్రీలీల స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ధ‌ర్మ‌న్‌కు హైలైట్స్‌ల‌లో ఒక‌టిగా శ్రీలీల సాంగ్ కూడా ఉండ‌బోతుంద‌ని అంటున్నారు.
ర‌జ‌నీకాంత్ సినిమాలో ఛాన్స్ కావ‌డంతో క‌న్న‌డ బ్యూటీ రెమ్యూన‌రేష‌న్ గురించి కూడా ఆలోచించ‌కుండా ఈ స్పెష‌ల్ సాంగ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

త‌మిళంలో బిజీ...

ప‌రాజ‌యాల కార‌ణంగా టాలీవుడ్‌కు దూర‌మైన శ్రీలీల త‌మిళంలో బిజీ అవుతోంది. ప్ర‌స్తుతం ధ‌నుష్ ఓం సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ రాజ్‌కుమార్ పెరియాసామీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా న‌వంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఓం సినిమాలో శ్రీలీల‌తో పాటు సాయిప‌ల్ల‌వి మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

 

Advertisement
Advertisement