త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | శ్రీలీల బ్యాడ్‌ల‌క్ కంటిన్యూ – త‌మిళ డెబ్యూ మూవీ ప‌రాశ‌క్తికి డిజాస్ట‌ర్ టాక్‌

శ్రీలీలకు త‌మిళంలోనూ అదృష్టం క‌లిసిరాలేదు. ప‌రాశ‌క్తి మూవీతో త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీతో హిట్టు అందుకోవాల‌ని క‌ల‌లు క‌న్న‌ది. శ‌నివారం రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్ టాక్ వ‌స్తోంది.

N

Entertainment | Published On Jan 10, 2026, 9.28 pm IST

Sreeleela | శ్రీలీల బ్యాడ్‌ల‌క్ కంటిన్యూ – త‌మిళ డెబ్యూ మూవీ ప‌రాశ‌క్తికి  డిజాస్ట‌ర్ టాక్‌
Advertisement

Sreeleela | తెలుగులో శ్రీలీల హిట్టు అందుకొని చాలా కాల‌మే అయ్యింది. మూడేళ్ల క్రితం వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత చాలానే సినిమాలు చేసింది. గుంటూరు కారం, జూనియ‌ర్‌, రాబిన్‌హుడ్, మాస్ జాత‌ర‌తో స్టార్ హీరోల‌తో ప‌లు సినిమాలు చేసింది. కానీ ఇవేవీ ఆమెకు విజ‌యాల‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. హిట్టు కోసం త‌మిళ బాట ప‌ట్టింది. ప‌రాశ‌క్తి మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించిన శ్రీలీల ప‌రాశ‌క్తిలో మాత్రం అందుకు భిన్నంగా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది. రిలీజ్‌కు ముందు రెట్రో లుక్‌లో శ్రీలీల క‌నిపించిన పోస్ట‌ర్లు, పాట‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. డెబ్యూ మూవీతోనే శ్రీలీల త‌మిళంలో హిట్టు అందుకోవ‌డం ఖాయ‌మ‌ని అంతా అనుకున్నారు. కానీ శ్రీలీల హిట్టు క‌ల మాత్రం తీర‌లేదు.
శ‌నివారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీకి దారుణంగా నెగెటివ్ టాక్ వ‌స్తోంది. హిందీ భాష‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడులో జ‌రిగిన ఉద్య‌మానికి ల‌వ్‌స్టోరీ, యాక్ష‌న్ డ్రామా అంశాలు జోడించి డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ఈ సినిమాను రూపొందించారు.

డివైడ్ టాక్...

కాన్సెప్ట్‌తో పాటు స్లో న‌రేష‌న్ కార‌ణంగా ప‌రాశ‌క్తి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ మొద‌లైంది. శివ‌కార్తికేయ‌న్ పాత్ర ప్రాధాన్య‌త త‌క్కువ‌గా ఉండ‌టం, ఆయ‌న శైలి మార్కు హీరోయిజం, కామెడీ టైమింగ్ మిస్స‌య్యాయంటూ అభిమానులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. శ్రీలీల యాక్టింగ్‌, శివ‌కార్తికేయ‌న్‌తో ఆమె ల‌వ్ ట్రాక్‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. శ్రీలీల‌కు హిట్టు ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు

పది కోట్ల లోపే..

ఫ‌స్ట్ డే ప‌రాశ‌క్తి మూవీ ప‌ది కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉందంటూ ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ప‌రాశ‌క్తి మూవీలో జ‌యం ర‌వి, అథ‌ర్వ ముర‌ళీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.
ప్ర‌స్తుతం తెలుగులో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా న‌టిస్తోంది. హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీ వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ ఒక్క సినిమా సినిమా మిన‌హా శ్రీలీల చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. మ‌రోవైపు శ్రీలీల ఈ ఏడాది హిందీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. అషికీ 2తో పాటు అరుంధ‌తి హిందీ రీమేక్‌లో న‌టిస్తోంది.

 

Advertisement
Advertisement