Sreeleela | తెలుగులో శ్రీలీల కొత్త ప్రయోగం – ఫస్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ జానర్‌లో క్రేజీ మూవీ!
తెలుగులో ఫస్ట్ టైమ్ శ్రీలీల ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మద్యపాన నిషేధం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి డైరెక్టర్ ఎవరంటే?
Entertainment | Published On Jun 16, 2026, 4.31 pm IST
Sreeleela | నయనతార, సాయిపల్లవి, సమంతతో పాటు మరికొందరు స్టార్ హీరోయిన్లు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ కథల్లో భాగమవుతోన్నారు. తాజాగా వీరి బాటలోనే శ్రీలీల అడుగులు వేయబోతున్నట్లు సమాచారం. తెలుగులో ఫస్ట్ టైమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి శ్రీలీల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
మద్యపాన నిషేదం...
రాజు వెడ్స్ రాంబాయి మూవీతో డైరెక్టర్ వేణు ఊడుగుల ప్రొడ్యూసర్‌గా మారారు. తొలి ప్రయత్నంలోనే పెద్ద సక్సెస్ అందుకున్నారు. రాజు వెడ్స్ రాంబాయి తర్వాత నిర్మాతగా వేణు ఊడుగల ఓ పీరియాడికల్ కామెడీ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిసింది. 1994లో మద్యపాన నిషేధం విధించిన తర్వాత జరిగిన పరిణామాలతో రూపొందనున్న ఈ సినిమాకు చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నారట. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేతో పాటు సాయిపల్లవిలలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో బిజీగా ఉన్న వీరిద్దరు ఈ పీరియాడికల్ మూవీని రిజెక్ట్ చేశారట. దాంతో చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
ఫస్ట్ టైమ్....
తెలుగులో ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు, గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది శ్రీలీల. ఫస్ట్ టైమ్ చుక్కలు తెమ్మన్నా తెంచుకురానాతో లేడీ ఓరియెంటెడ్ జానర్‌ను టచ్ చేయబోతుంది. కాగా శ్రీలీల తెలుగులో హిట్టు కొట్టి చాలా రోజులే అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ జానర్‌తోనైనా మళ్లీ సక్సెస్ బాట పడుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు రమేష్ ఎలిగేటి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
తమిళంలో...
ప్రస్తుతం తమిళంలో ధనుష్‌తో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది శ్రీలీల. హిందీలో ఆషీకి 3లో హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malavika Mohanan | ఇప్పుడు రిజెక్ట్ – ఇప్పుడు రొమాన్స్ – మాస్ మహారాజా మల్టీస్టారర్‌లో రాజాసాబ్ హీరోయిన్
జులై 19, 2026

Nivetha Thomas | రెండేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ – లేడీ ఓరియెంటెడ్ మూవీలో నివేదా థామస్ – టైటిల్ ఇదే!
జులై 19, 2026

National Awards | నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే – బెస్ట్ యాక్టర్‌గా మమ్ముట్టి – ఉత్తమ నటిగా యామీ గౌతమ్
జులై 18, 2026
తాజావార్తలు
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
- ●HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
- ●IndiGo Onam Special Flights | పండుగ వేళ ఇండిగో బంపర్ ఆఫర్: హైదరాబాద్ నుంచి కేరళకు స్పెషల్ ఫ్లైట్స్.. పూర్తి వివరాలివే!
- ●FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ●Woman dies in hospital | ఆస్పత్రిలో మహిళ మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

IndiGo Onam Special Flights | పండుగ వేళ ఇండిగో బంపర్ ఆఫర్: హైదరాబాద్ నుంచి కేరళకు స్పెషల్ ఫ్లైట్స్.. పూర్తి వివరాలివే!



