త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Om Movie | టైటిల్ మార్చాల్సిందే – శ్రీలీల త‌మిళ మూవీకి సెన్సార్ అడ్డంకులు

ధ‌నుష్, శ్రీలీల త‌మిళ మూవీ ఓం రిలీజ్ ముంగిట చిక్కుల్లో ప‌డింది. ఈ సినిమా టైటిల్‌పై సెన్సార్ బోర్డ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ రాజ్‌కుమార్ పెరియాసామీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి ఫారెస్ట్‌ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

N

Entertainment | Published On Nov 13, 2026, 3.52 pm IST

Om Movie | టైటిల్ మార్చాల్సిందే – శ్రీలీల త‌మిళ మూవీకి సెన్సార్ అడ్డంకులు
Advertisement

Om Movie | రిలీజ్ ముంగిట ధ‌నుష్ ఓం మూవీ చిక్కుల్లో ప‌డింది. ఈ సినిమా టైటిల్‌పై సెన్సార్ బోర్డ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ధ‌నుష్, సాయిప‌ల్ల‌వి, శ్రీలీల హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఓం న‌వంబ‌ర్ 20న రిలీజ్ కాబోతుంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ రాజ్‌కుమార్ పెరియాసామీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో మ‌ల‌యాళ అగ్ర న‌టుడు మ‌మ్ముట్టి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

శేషాచ‌లం అడ‌వులు...

శేషాచ‌లం అడ‌వుల నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ఈ త‌మిళ‌ మూవీ రూపొందుతోంది. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా వెన‌కున్న‌ది ఎవ‌రు? పొట్ట‌కూటి కోసం ఈ స్మ‌గ్లింగ్‌లో భాగ‌మ‌వుతోన్న కూలీలు జీవితాలు ఎలా విషాదంగా ముగుస్తున్నాయ‌నే అంశాల‌తో రాజ్‌కుమార్ పెరియాసామీ ఓం సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఇందులో బ‌ర్మా కార్తికేయ‌న్ అనే స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో మ‌మ్ముట్టి నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో న‌టిస్తోండ‌గా...కూలీగా ధ‌నుష్ క‌నిపించ‌బోతున్నారు. ఫారెస్ట్ ఆఫీస‌ర్‌గా సాయిప‌ల్ల‌వి, ధ‌నుష్ భార్య‌గా శ్రీలీల న‌టిస్తోన్నారు.

టైటిల్ మార్చాల్సిందే...

రిలీజ్‌కు మ‌రో వారం ఉంద‌న‌గా ఓం మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్‌పై సెన్సార్ బోర్డ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తోన్నాయి. ఓం అనే ప‌దానికి హిందూ పురాణాల్లో ప‌విత్ర‌మైన అర్థం, స్థానం ఉన్నాయ‌ని, అలాంటి ప‌దంతో హింస, ర‌క్త‌పాతంతో కూడిన సినిమా చేయ‌డం స‌రికాదంటూ మేక‌ర్స్‌కు సెన్సార్ బోర్డు సూచించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. వివాదాలు త‌ల్తెత్త‌క‌ముందే ఈ సినిమా టైటిల్‌లో మార్పులు చేయాల్సిందిగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను కోరిన‌ట్లు స‌మాచారం. టైటిల్ మార్చిన త‌ర్వాతే సెన్సార్ స‌ర్టిఫికేట్ జారీ చేస్తామ‌ని ఖ‌రాఖండిగా సెన్సార్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలిసింది.

రివైజింగ్ క‌మిటీ

సెన్సార్ బోర్డ్ సూచ‌న‌ల‌తో మేక‌ర్స్ ఓం అనే టైటిల్‌లో మార్పులు చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఓ ఎమ్‌...అక్ష‌రాల మ‌ధ్య పుల్‌స్టాప్ పెట్టి రివైజింగ్ క‌మిటీకి పంపించార‌ని అంటున్నారు. ఈ టైటిల్‌కు కూడా ఇంకా సెన్సార్ బోర్డ్ క్లియ‌రెన్స్ ఇవ్వ‌లేద‌ని టాక్‌. ఈ అభ్యంత‌రాల నేప‌థ్యంలో ఇదే టైటిల్‌తో సినిమా రిలీజ్ అవుతుందా? లేదంటే మ‌రో కొత్త పేరు పెడ‌తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా ఓం మూవీ త‌మిళంతో పాటు తెలుగులోనూ ఒకే రిలీజ్ విడుద‌ల కాబోతుంది. కాగా ధ‌నుష్ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు కొన్నాళ్లుగా పుకార్లు వ‌స్తోన్నాయి. ఈ వార్త‌ల న‌డుమ అత‌డి సినిమాకు సెన్సార్ అడ్డంకులు ఎదురుకావ‌డం కోలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement