త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | ఎట్ట‌కేల‌కు శ్రీలీల‌కు తెలుగులో ఓ ఛాన్స్ – రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించిన‌ బ్యూటీ

తెలుగులో శ్రీలీల‌కు ఎట్ట‌కేల‌కు ఓ ఛాన్స్ ద‌క్కింది. ఫ్లాప్ హీరోతో మూడోసారి జోడీగా న‌టించ‌బోతుంది. ఆ హీరో ఎవ‌రు? సినిమా ఏదంటే?

N

Entertainment | Published On Jul 23, 2026, 3.37 pm IST

Sreeleela | ఎట్ట‌కేల‌కు శ్రీలీల‌కు తెలుగులో ఓ ఛాన్స్ – రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించిన‌ బ్యూటీ
Advertisement

Sreeleela |   డిజాస్ట‌ర్ల‌లో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టేసింది శ్రీలీల‌. అయినా ఈ ముద్దుగుమ్మ క్రేజ్‌కు ఢోకా లేదు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ఫెయిల్యూర్ త‌ర్వాత తెలుగులో కొత్త సినిమా ఏదీ అంగీక‌రించ‌లేదు శ్రీలీల‌. బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌టంతో టాలీవుడ్ ఈ ధ‌మాకా బ్యూటీని ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు రూమ‌ర్లు వినిపించాయి. తొమ్మిది ఫ్లాపుల కార‌ణంగా టాలీవుడ్‌లోకి శ్రీలీల క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌డం క‌ష్ట‌మేన‌ని అన్నారు. కానీ పుకార్లుకు చెక్ పెడుతూ శ్రీలీల తెలుగులో ఓ కొత్త సినిమాను అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం.

నితిన్‌తో మూడోసారి...

టాలీవుడ్ హీరో నితిన్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి జోడీక‌ట్ట‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. నితిన్‌, శ్రీలీల కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌, రాబిన్‌హుడ్ సినిమాలు వ‌చ్చాయి. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి.

హ్యాట్రిక్ మూవీ....

ఈ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్న‌ట్లు టాక్‌. నితిన్ హీరోగా ఆయ్ ఫేమ్ అంజి డైరెక్ష‌న్‌లో ఓ ఫ‌న్ ఫ్యామిలీ ల‌వ్‌స్టోరీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో నితిన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా శ్రీలీలను ఫైన‌ల్ చేశార‌ట‌. నితిన్‌, శ్రీలీల ఇద్ద‌రు ఫ్లాపుల్లోనే ఉండ‌టంతో లిమిటెడ్ బ‌డ్జెట్‌లోనే ఈ సినిమాను తెర‌కెక్కించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ సినిమా కోసం శ్రీలీల త‌న రెమ్యూన‌రేష‌న్‌ను త‌గ్గించుకోవ‌డానికి అంగీక‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

శ్రేష్ట్ మూవీస్‌...

నితిన్ స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ట‌. ఈ మూడో సినిమాతోనైనా నితిన్‌, శ్రీలీల జోడీ హిట్టు కొడుతుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌మిళంలో....

ప్ర‌స్తుతం త‌మిళంలో ఓం సినిమాతో బిజీగా ఉంది శ్రీలీల‌. ధ‌నుష్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీలో సాయిప‌ల్ల‌వి మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాలీవుడ్‌లో శ్రీలీల రెండు సినిమాల‌ను అంగీక‌రించింది. నిర్మాణ ప‌ర‌మైన చిక్కుల కార‌ణంగా ఈ సినిమాల షూటింగ్‌లు నిదానంగా సాగుతోన్నాయి.

 

Advertisement
Advertisement