త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kolli Satyanarayana | ప్ర‌జా సంఘాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కొల్లి స‌త్య‌నారాయ‌ణ‌

Kolli Satyanarayana | నల్గొండ - వరంగల్ - ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్ర‌ముఖ న్యాయ‌వాది కొల్లి సత్యనారాయణ( Kolli Satyanarayana ) పేరు ఖ‌రారైంది. కొల్లి స‌త్య‌నారాయ‌ణ ప్ర‌జా సంఘాల త‌ర‌పున పోటీ చేయ‌నున్నారు.

S

Telangana | Published On Oct 27, 2026, 5.14 pm IST

Kolli Satyanarayana | ప్ర‌జా సంఘాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కొల్లి స‌త్య‌నారాయ‌ణ‌
Advertisement

Kolli Satyanarayana | త్రినేత్ర న్యూస్ : నల్గొండ - వరంగల్ - ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్ర‌ముఖ న్యాయ‌వాది కొల్లి సత్యనారాయణ( Kolli Satyanarayana ) పేరు ఖ‌రారైంది. కొల్లి స‌త్య‌నారాయ‌ణ ప్ర‌జా సంఘాల త‌ర‌పున పోటీ చేయ‌నున్నారు. మంగ‌ళ‌వారం సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ప్ర‌జా సంఘాల ఆధ్వ‌ర్యంలో కొల్లి అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేశారు.

ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన స‌త్యనారాయ‌ణ‌ 42 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రముఖ సీనియర్‌ న్యాయవాది బోడపూడి రాధాకృష్ణ శిష్యుడైన ఈయన రాజ్యసభ మాజీ సభ్యుడు వై.రాధాకృష్ణమూర్తి అన్న కుమారుడు. గతంలో మూడుసార్లు స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం అఖిల భారత న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

Advertisement
Advertisement