త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | డ‌బ్బులు న‌ష్ట‌పోవాల‌ని అనుకోవ‌డం లేదు – ప్రొడ్యూస‌ర్‌గా మార‌డంపై కీర్తి సురేష్ క్లారిటీ

న‌య‌న‌తార రూట్‌ను కీర్తి సురేష్ ఫాలో కాబోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ద‌క్షిణాదిలో అగ్ర నాయిక‌గా కొన‌సాగుతోన్న ఈ కోలీవుడ్ సొగ‌స‌రి త్వ‌ర‌లోనే నిర్మాత‌గా అరంగేట్రం చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల‌పై మ‌హాన‌టి క్లారిటీ ఇచ్చింది.

N

Entertainment | Published On Oct 27, 2026, 4.13 pm IST

Keerthy Suresh |  డ‌బ్బులు న‌ష్ట‌పోవాల‌ని అనుకోవ‌డం లేదు – ప్రొడ్యూస‌ర్‌గా మార‌డంపై కీర్తి సురేష్ క్లారిటీ
Advertisement

Keerthy Suresh |  న‌య‌న‌తార‌ (Nayanthara), నిత్యామీన‌న్‌తో పాటు చాలా మంది స్టార్ హీరోయిన్లు ప్రొడ్యూస‌ర్లుగా రాణిస్తున్నారు. ఓ వైపు క‌థానాయిక‌లుగా పెద్ద సినిమాలు చేస్తూనే... త‌మ అభిరుచుల‌కు త‌గ్గ క‌థ‌ల‌తో కూడిన స్మాల్ బ‌డ్జెట్ మూవీస్‌ను నిర్మిస్తూ విజ‌యాల‌ను అందుకుంటున్నారు. న‌య‌న‌తార బాట‌లోనే మ‌హాన‌టి కీర్తి సురేష్ అడుగులు వేయ‌బోతున్న‌ట్లు కొద్ది రోజులుగా త‌మిళంలో పుకార్లు షికారు చేస్తోన్నాయి.

సొంతంగా క‌థ‌లు...

ఈ వార్త‌ల‌పై అక్క వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్స్‌లో కీర్తి సురేష్ (Keerthy Suresh)క్లారిటీ ఇచ్చింది. డ‌బ్బులు న‌ష్ట‌పోవాల‌ని అనుకోవ‌డం లేదంటూ చెప్పింది. ద‌ర్శ‌కురాలిగా మారే ఆలోచ‌న‌లో ఉన్న కీర్తి సురేష్ అందుకోసం సొంతంగా క‌థ‌లు కూడా రాస్తున్న‌ట్లు తెలిపింది.

తెర వెనుక‌...

"కెమెరా ముందే కాదు...తెర వెనుక కూడా ఏం జ‌రుగుతుందో తెలుసుకోవ‌డం నాకు ఇష్టం. అందుకే సెట్స్‌లో ఏ మాత్రం గ్యాప్ దొరికిన ద‌ర్శ‌కులు, కెమెరామెన్ల‌తో పాటు ఇత‌ర సాంకేతిక నిపుణులు ఎలా ప‌నిచేస్తుంటారో ప‌రిశీలిస్తుంటాను. గ్యాప్ దొరికితే నా ఆలోచ‌న‌ల‌ను కాగితంపై పెడుతుంటా. జాన‌ర్‌తో సంబంధం లేకుండాచాలా క‌థ‌లు రాశాను. సినిమాల్లోకి రాక‌ముందు నుంచి ఈ అల‌వాటు ఉంది. భ‌విష్య‌త్తులో నా సొంత క‌థ‌తోనే ద‌ర్శ‌కురాలిగా సినిమా చేస్తాను కావ‌చ్చు" అంటూ మ‌హాన‌టి బ‌దులిచ్చింది. బ‌దులిచ్చింది.

న‌ష్ట‌పోవాల‌ని...

కానీ సినిమా నిర్మాణంలోకి మాత్రం అడుగుపెట్ట‌న‌ని కీర్తి సురేష్ అన్న‌ది. "ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిల‌దొక్కుకుంటున్నా. డ‌బ్బులు న‌ష్ట‌పోవాల‌ని అనుకోవ‌డం లేదు. ఓ సినిమా చేసి లాస్ అయిన‌ త‌ట్టుకోగ‌ల స్థోమ‌త‌, శ‌క్తి వ‌చ్చిన త‌ర్వాతే ప్రొడ‌క్ష‌న్ గురించి ఆలోచిస్తా. అప్ప‌టివ‌ర‌కు నిర్మాత‌గా మారాల‌నే ఆలోచ‌న‌ను మ‌న‌సులోకి రానివ్వ‌ను. మా నాన్న నిర్మాత‌గా చాలా సినిమాలు చేశారు. నిర్మాత‌ల క‌ష్టాలు ఎలా ఉంటాయో ప్ర‌త్య‌క్షంగా తెలుసు" అంటూ బ‌దులిచ్చింది.

బిజీయోస్ట్ హీరోయిన్‌...

ద‌క్షిణాదిలో ప్ర‌స్తుతం మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది కీర్తి సురేష్. తెలుగులో జ‌న‌వ‌రి 12 విడుద‌ల‌, రౌడీ జ‌నార్ధ‌న సినిమాలు చేస్తోంది. త‌మిళంలో స‌త్య‌వ‌న్ సావిత్రితో పాటు మ‌రో రెండు సినిమాల‌ను అంగీక‌రించింది. హిందీలో అక్క వెబ్‌సిరీస్‌తో పాటు రాఫ్తార్ పేరుతో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

 

Advertisement
Advertisement