త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | సోష‌ల్ మీడియాలో శ్రీలీల రేంజ్ మామూలుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత డిమాండ్ చేస్తుందంటే?

సినిమాలే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శ్రీలీల భారీగానే సంపాదిస్తుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఒక్కో ప్ర‌మోష‌న‌ల్ పోస్ట్ కోసం ఈ బ్యూటీ ఐదు నుంచి ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్‌ స్వీక‌రిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ పోస్ట్‌ల ద్వారానే నెల‌కు ముప్పై నుంచి యాభై ల‌క్ష‌ల వ‌ర‌కు డ‌బ్బుల‌ను వెన‌కేసుకుంటుంద‌ని అంటున్నారు.

N

Entertainment | Published On Jul 10, 2026, 4.25 pm IST

Sreeleela | సోష‌ల్ మీడియాలో శ్రీలీల రేంజ్ మామూలుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత డిమాండ్ చేస్తుందంటే?
Advertisement

Sreeleela | ఇదివ‌ర‌కు సోష‌ల్ మీడియా అంటే కేవ‌లం హీరోహీరోయిన్ల‌కు అభిమానుల‌కు మ‌ధ్య ఓ వార‌ధిగానే ఉప‌యోగ‌ప‌డేది. త‌మ కొత్త సినిమాల అప్‌డేట్స్ గురించి వెల్ల‌డించ‌డానికే సోష‌ల్ మీడియాను వాడేవారు స్టార్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సోష‌ల్ మీడియానే స్టార్స్ ఇమేజ్‌, రేంజ్‌ను నిర్ణ‌యిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌ల‌లో ఎంత ఎక్కువ మంది ఫాలోవ‌ర్స్ ఉంటే అంత పెద్ద స్టార్ అని అర్థం. అంతే కాకుండా హీరోహీరోయిన్ల‌కు అద‌న‌పు ఆదాయ వ‌న‌రుగా కూడా సోష‌ల్ మీడియా మారిపోయింది.

దీపికా ప‌డుకోణ్‌...ర‌ష్మిక మంద‌న్న‌...

ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌ల‌లో ప్ర‌మోష‌న‌ల్ పోస్ట్‌ల ద్వారా సెలిబ్రిటీలు కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు. దీపికా ప‌డుకోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్ కోసం రెండు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటోంది. ర‌ష్మిక మంద‌న్న ఇర‌వై నుంచి ఇర‌వై ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు డిమాండ్ చేస్తుంద‌ట‌. విరాట్ కోహ్లి అయితే ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు 14 కోట్ల తీసుకుంటూ హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్న సెలిబ్రిటీగా రికార్డ్ క్రియేట్ చేశాడు.

ప‌ద‌హారు మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు....

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భారీగా సంపాదిస్తున్న సెలిబ్రిటీల లిస్ట్‌లో ధ‌మాకా బ్యూటీ శ్రీలీల కూడా చేరిపోయింది. సినిమాల ప‌రంగా స‌క్సెస్‌లు లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ‌కు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీలకు ప‌ద‌హారు మిలియ‌న్ల‌కుపైనే ఫాలోవ‌ర్లు ఉన్నారు. ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ఈ అమ్మ‌డికి ఉన్న క్రేజ్ కార‌ణంగా ఎండార్స్‌మెంట్ డీల్స్ బాగానే వ‌స్తున్నాయిన టాక్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో బ్రాండ్ ప్ర‌మోష‌న్ పోస్ట్ కోసం శ్రీలీల ఐదు నుంచి ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారానే నెలకు 30 నుంచి 50 ల‌క్ష‌ల మ‌ధ్య శ్రీలీల సంపాదిస్తున్న‌ట్లు స‌మాచారం. సినిమాల కంటే సోష‌ల్ మీడియానే ద్వారానే ఎక్కువ‌గా డ‌బ్బుల‌ను వెన‌కేసుకుంటుద‌ని అంటున్నారు.

త‌మిళంలో...

ప్ర‌స్తుతం శ్రీలీల త‌మిళంలో ధ‌నుష్‌తో ఓం ఛాప్ట‌ర్ వ‌న్ సినిమా చేస్తోంది. ఈ మూవీలో శ్రీలీల‌తో పాటు సాయిప‌ల్ల‌వి మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ మూవీ షూటింగ్ మొద‌లైంది. వ‌రుస డిజాస్ట‌ర్ల కార‌ణంగా టాలీవుడ్‌కు దూర‌మైంది శ్రీలీల‌. ఈ ఏడాది రిలీజైన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌లో హీరోయిన్‌గా న‌టించిన శ్రీలీల‌. ప‌వ‌ర్ స్టార్ సినిమా కూడా ఆమెకు హిట్టు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది.

 

Advertisement
Advertisement