Sreeleela | శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీ షూటింగ్ కష్టాలు – ఈ ఏడాది రిలీజ్ కావడం అనుమానమే?
వరుస డిజాస్టర్లతో ఇప్పటికే టాలీవుడ్‌కు దూరమైన శ్రీలీలకు బాలీవుడ్‌లోనూ దురదృష్టం వెంటాడుతోంది. శ్రీలీల హిందీ డెబ్యూ మూవీ తూ మేరీ జిందగీ హై అనౌన్స్‌చేసి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తి కాలేదట.
Entertainment | Published On Apr 23, 2026, 4.56 pm IST
Sreeleela | బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లతో టాలీవుడ్‌లో శ్రీలీలపై ఐరెన్ లెగ్‌గా ముద్రపడింది. ఉస్తాద్ భగత్‌సింగ్‌తో ఫ్లాపుల్లో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టింది. ఈ పరాజయాలతో శ్రీలీల టాలీవుడ్ కెరీర్‌కు దాదాపు పుల్‌స్టాప్ పడింది. మరో ఆఫర్ రావడం కష్టమేనంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో టాలీవుడ్‌పై ఆశలు వదులుకున్న శ్రీలీల బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ బాట పట్టింది. కానీ అక్కడ కూడా ఆమె కెరీర్ ఆశాజనకంగా సాగడం లేదు. శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీ అనౌన్స్ చేసి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్పటివరకు సగం కూడా షూటింగ్ కంప్లీట్ కాలేదట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు వెల్లడించడంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందాననే అనుమానం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
ఆషీకి ఫ్రాంచైజ్‌లో...
కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా మూవీ తెరకెక్కింది. ఆషీకీ ఫ్రాంచైజ్‌లో భాగంగా రాబోతున్న ఈ బాలీవుడ్ మూవీకి తూ మేరీ జిందగీ హై అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఆమె హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
గత ఏడాది ఫిబ్రవరిలో...
గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రోమోను రిలీజ్ చేశారు. 2025 డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ వాయిదాపడింది.
తాజాగా శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీపై దర్శకుడు అనురాగ్ బసు చేసిన కామెంట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి కేవలం 45 రోజులు మాత్రమే చిత్రీకరణ జరిపామని అన్నారు. అసలైన షూటింగ్ ఇప్పటివరకు మొదలుపెట్టలేని తెలిపారు.. షూటింగ్ పూర్తవ్వడానికి మరో ఏడెనిమిది నెలలు పట్టొచ్చునని పేర్కొన్నారు.
అనురాబ్ బసు కామెంట్లతో శ్రీలీల హిందీ మూవీ ఈ ఏడాది కూడా రిలీజ్ కావడంఅనుమానమేనని నెటిజన్లు అంటున్నారు. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా? అంటూ మరికొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
అనురాగ్ బసు మూవీతో పాటు శ్రీలీల హిందీలో మరో రెండు సినిమాలు చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాలపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



