త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vishnu Vinyasam OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ శ్రీవిష్ణు కామెడీ మూవీ – మూఢ‌న‌మ్మ‌కాల కాన్సెప్ట్‌తో

శ్రీవిష్ణు హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ విష్ణువిన్యాసం థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. విష్ణువిన్యాసం మూవీలో న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On Mar 20, 2026, 2.55 pm IST

Vishnu Vinyasam OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ శ్రీవిష్ణు కామెడీ మూవీ – మూఢ‌న‌మ్మ‌కాల కాన్సెప్ట్‌తో
Advertisement

Vishnu Vinyasam OTT | విష్ణు విన్యాసం మూవీతో టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు విజ‌యాల ప‌రంప‌ర‌కు బ్రేక్ ప‌డింది. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. తాజాగా విష్ణువిన్యాసం మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ ఇర‌వై రోజుల గ్యాప్‌లోనే విష్ణువిన్యాసం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

న‌య‌న్ సారిక హీరోయిన్‌...

విష్ణువిన్యాసం మూవీలో న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టించింది. య‌ధునాథ్ మారుతీరావు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. స‌త్యం రాజేష్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, బ్ర‌హ్మాజీతో పాటు ప‌లువురు టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

జాత‌కాలు, మూఢ‌న‌మ్మ‌కాల కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను రూపొందించారు. క‌థ‌ ఔట్‌డేటెడ్ కావ‌డం, కామెడీ అనుకున్న స్థాయిలో వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో విష్ణువిన్యాసం తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించ‌లేక‌పోయింది.
దాదాపు ఇర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ప‌ది కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. 50 శాతం లోపే రిక‌వ‌రీ సాధించి నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది.

జాత‌కాల పిచ్చితో...

విష్ణు (శ్రీవిష్ణు) ఓ కాలేజీలో జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. జాత‌కాలు, వాస్తు పిచ్చి ఎక్కువ‌. ఏ ప‌ని చేయాల‌న్న ముహూర్తం చూసుకుంటాడు. 30 ఏళ్లు వ‌చ్చినా పెళ్లికాదు. త‌న కాలేజీలోనే ప‌నిచేసే మ‌నీషా (న‌య‌న్ సారిక‌)ను ఇష్ట‌ప‌డ‌తాడు. విష్ణుకు భిన్న‌మైన మ‌న‌స్త‌త్వం మ‌నీషాది. గొడ‌వ‌ల‌తో ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటారు. అదే టైమ్‌లో మ‌నీషా జాత‌కం గురించి ఓ షాకింగ్ నిజం విష్ణుకు తెలుస్తుంది. మ‌నీషా జాత‌కంలో రెండు పెళ్లిళ్ల యోగం ఉంద‌ని, మొద‌టి భ‌ర్త పెళ్లైన ఆరు నెల్లోనే యాక్సిడెంట్‌లో చ‌నిపోతాడ‌ని జ్యోతిష్యుడు చెబుతాడు. జాత‌కాల‌ను న‌మ్మే విష్ణు మ‌నీషాతో పెళ్లి విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? జ్యోతిష్యుడు చెప్పిందే జ‌రిగిందా? మ‌నీషా త‌ల్లిదండ్రులు సొంత కూతురినే ఎందుకు మోసం చేశారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Advertisement

తాజావార్తలు

Advertisement