With Love Review | విత్ లవ్ రివ్యూ – రజనీకాంత్ కూతురు నిర్మించిన రొమాంటిక్ కామెడీ మూవీ హిట్టా? ఫట్టా?
టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవంత్ హీరోగా నటించిన విత్ లవ్ మూవీ ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైంది. సౌందర్య రజనీకాంత్ నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Feb 6, 2026, 12.23 pm IST
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో దర్శకుడిగా మెప్పించిన అభిషన్ జీవంత్ విత్ లవ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. క్యూట్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య నిర్మాతగా వ్యవహరించారు. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో ఒకే రోజు థియేటర్లలో రిలీజైంది. విత్ లవ్ ఎలా ఉంది? హీరోగా అభిషన్ జీవంత్ ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అంటే?
స్కూల్ మేట్స్ లవ్ జర్నీ....
సత్య (అభిషన్ జీవంత్)ఓ ఆర్కిటెక్చర్. ప్రేమలో ఫెయిలవుతాడు. సత్యకు పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వచ్చిన సంబంధాలు అన్ని రిజెక్ట్ చేస్తుంటాడు. అక్క బలవంతం మేరకు మనీషా (అనస్వర రాజన్) అనే అమ్మాయిని పెళ్లిచూపులు చూడటానికి వెళతాడు. మనీషా...స్కూల్‌లో తనకంటే రెండేళ్లు జూనియర్ అనే సంగతి సత్యకు తెలుస్తుంది. ఇద్దరూ స్కూల్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. ఈ క్రమంలో స్కూల్ డేస్‌లో అనీషా అనే అమ్మాయిని ప్రేమించిన సంగతి బయటపెడతాడు సత్య. మనీషా కూడా బాలాజీని ఇష్టపడుతుంది. కానీ ఇద్దరి ప్రేమకథలకు బ్రేకప్ పడుతుంది. తమ మాజీ ప్రేమికులను కలవాలని అనుకుంటారు సత్య, మనీషా. ఆ తర్వాత ఏమైంది? అనీషాను సత్య...బాలాజీని మనీషా కలిసిందా? సత్య, మనీషా పెళ్లి జరిగిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
ప్రేమలోని మ్యాజిక్....
సిల్వర్ స్క్రీన్‌పై ప్రేమకథలు చాలా వరకు ఒకే ఫార్మెట్‌లో సాగుతాయి. ప్రేమ ప్రయాణంలో తమకు ఎదురైన అడ్డంకులను దాటుకొని ఓ జంట ఎలా ఒక్కటయ్యారన్నది చూపిస్తూ శుభంకార్డు వేయడం కామన్. ఈ రొటీన్ పాయింట్‌ను ఆడియెన్స్‌ను మెప్పించేలా చెప్పడం నిజంగా కత్తిమీద సామే. కొందరు దర్శకులు నాయకానాయికల కాన్‌ఫ్లిక్ట్‌ను ఎమోషనల్‌గా ఆవిష్కరిస్తే సీరియస్‌గా చెబితే మరికొందరు వినోదాన్ని జోడించి మ్యాజిక్ చేస్తుంటారు.
విత్ లవ్ రెండో కోవకు చెందిన సినిమా. తమ మాజీ ప్రేమికులను కలుసుకోవడానికి ఓ జంట సాగించే జర్నీతో కథను మొదలుపెట్టి చివరకు వారిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారనే పాయింట్‌తో ఎండవుతుంది. ఈ సింపుల్ పాయింట్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాడు డైరెక్టర్. ప్రతి ఒక్కరూ తమ స్కూల్ లవ్‌స్టోరీస్‌తో సహానుభూతి చెందేలా కన్వీన్సింగ్‌గా స్క్రీన్‌పై ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
సోషల్ మీడియా లేని యుగంలో...
సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌లు రాని యుగంలో ప్రేమకథలు ఎలా సాగేవి అన్నది దర్శకుడు ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. ఫ్లేమ్స్, కాయిన్ బాక్స్‌లు వంటి సన్నివేశాలను రీక్రియేట్ చేస్తూ నోస్టాల్జియా ఫీలింగ్‌ను కలిగించాడు. రా అండ్ రస్టిక్‌గా చెబితే ఆడియెన్స్ బోర్‌గా ఫీలయ్యే ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రతి సీన్ నుంచి ఫన్ జనరేట్ అయ్యేలా రాసుకున్నాడు. ఇంట్రోవర్ట్ అయిన అబ్బాయి...రెబెల్ యాటిట్యూడ్ కలిగిన అమ్మాయిని ఇష్టపడటం...భిన్న మనస్తత్వాల కారణంగా వారికి ఎదురయ్యే ఇబ్బందులు నవ్విస్తాయి.
షుగర్ కోటెడ్ మెసేజ్...
సత్య పాత్ర పరిచయం...పెళ్లి చూపులు సీన్‌తో కథను మొదలుపెట్టారు. ఆ తర్వాత హీరో...హీరోయిన్ల బ్రేకప్ లవ్‌స్టోరీస్ తాలూకు ష్లాష్‌బ్యాక్‌లతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది. సెకండాఫ్‌ను మాత్రం సత్య, మనీషా ఎలా ప్రేమలో పడ్డారు? బంధాలు, బాధ్యతలను స్వీకరించే క్రమంలో యువతరం ఎదుర్కొంటున్న కన్ఫ్యూజన్‌ను కామెడీ, ఎమోషన్స్ మేళవించి చెప్పారు. కథలో మెసేజ్ ఉన్న ఎక్కడ షుగర్ కోటెడ్‌లా ఉంటుంది తప్పితే క్లాస్ ఇస్తున్నట్లుగా సీరియస్‌గా చెప్పలేదు. కామెడీ టెంపోను చివరి వరకు మిస్ కాకుండా చూసుకోవడం బాగుంది.
96...ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్...
విత్ లవ్ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ పాతదే. ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, 96 మొదలుకాని ఈ తరహా లవ్‌స్టోరీస్‌తో చాలా సినిమాలు వచ్చాయి. సెకండాఫ్ సిండ్రోమ్ దర్శకుడిలో కనిపించింది. కామెడీతో పర్వాలేదనిపించిన ఎమోషన్స్ విషయంలో తడబడిపోయారు.
అనస్వర రాజన్ హైలైట్...
సత్య పాత్రకు అభిషన్ జీవంత్ న్యాయం చేశాడు. హీరోగా ఇదే ఫస్ట్ మూవీ అయినా ఎక్కడ ఆ భావన కలగకుండా నటించాడు. అనస్వర రాజన్ తన ఎక్స్‌ప్రెషన్స్, మ్యానరిజమ్స్‌తో ఆకట్టుకుంది. ఒక రకంగా ఈ సినిమాకు ఆమె నటన ప్లస్ పయింట్‌గా నిలిచింది. వీరిద్దరి పాత్రల ప్రధానంగానే ఈ సినిమా సాగుతుంది. కావ్య అనిల్, సచిన్ నాచప్సన్ పర్వాలేదనిపించారు.
ప్రొడక్షన్ వాల్యూస్...
డబ్బింగ్ మూవీ అయినా తెలుగు డైలాగ్స్, సాంగ్ లిరిక్స్ విషయంలో మేకర్స్ తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మీమ్స్‌ను ఈ సినిమాలో వాడుకున్న తీరు బాగుంది. మచరిపోవాలి మనసా పాట బాగుంది. డైరెక్టర్ చెప్పిన కథను నమ్మి ప్రొడక్షన్ విషయంలో సౌందర్య రజనీకాంత్ ఎక్కడ రాజీ పడలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.
విత్ లవ్ యూత్ ఆడియెన్స్‌ను మెప్పించే క్యూట్ లవ్‌స్టోరీ. కొత్త కథ కాదు. కానీ నోస్టాల్జియా ఫీలింగ్‌ను కలిగిస్తూనే రెండు గంటల పన్నెండు నిమిషాలు ఫుల్ టైమ్‌పాస్ చేస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



