Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ – లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్
రజనీకాంత్ కూతురు సౌందర్య తొమ్మిదేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. లవ్ పేరుతో తమిళంలో రొమాంటిక్ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. డేటింగ్ యాప్ కల్చర్‌పై తెరకెక్కిన ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్‌లో అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.
Entertainment | Published On Sep 26, 2026, 4.20 pm IST
Web Series |రజనీకాంత్ కూతురు సౌందర్య తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్రాఫిక్ డిజైనర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసిన సౌందర్య కోలీవుడ్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపును సొంతం చేసుకుంది. ధనుష్ హీరోగా 2017లో రిలీజైన వీఐపీ 2 సినిమాకు సౌందర్య దర్శకత్వం వహించింది. ఈ మూవీ తర్వాత కోలీవుడ్‌కు దూరమైన సౌందర్య దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఓ రొమాంటిక్ వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది. డేటింగ్ యాప్ కల్చర్‌పై సౌందర్య ఓ వెబ్‌సిరీస్ చేసింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్...
లవ్ పేరుతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌లో అర్జున్ దాస్, ఐశ్వరలక్ష్మి లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ వెబ్‌సిరీస్‌కు ప్రొడ్యూసర్‌గా మాత్రమే కాకుండా షో రన్నర్‌గా సౌందర్య రజనీకాంత్ వ్యవహరిస్తోంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో లవ్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళంలో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.
ట్రైలర్ రిలీజ్...
లవ్ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. లిప్‌లాక్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్లతో యూత్ ఆడియెన్స్‌ను ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇద్దరు డేటింగ్ యాప్ నిర్వహకుల మధ్య పోటీతో డైరెక్టర్ బాలాజీ మోహన్ ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. తార ఫౌండ్ అనే డేటింగ్ యాప్‌ను నెలకొల్పుతుంది. మాథ్యూ కూడా ఫైండ్ మై బే పేరుతో ఓ డేటింగ్ యాప్‌ను నడుపుతుంటాడు. ప్రేమ విషయంలో ఇద్దరి దృక్పథాలు వేర్వేరుగా ఉంటాయి. వ్యాపారంలో పోటీదారుడైన మాథ్యూతో తార ఓ ఛాలెంజ్ చేస్తుంది. అదేమిటి? ఆ బెట్ కారణంగా ఇద్దరి లైఫ్‌లు ఎలాంటి మలుపులు తిరిగాయనే కథతో ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోంది.
ఆన్‌లైన్ డేటింగ్ కల్చర్...
ఆన్‌లైన్ డేటింగ్ యాప్ కల్చర్, జెన్‌జీ మనస్తత్వాలను ప్రతిబింబిస్తూ దర్శకుడు బాలాజీ మోహన్ ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. పొన్నియన్ సెల్వన్, థగ్ లైఫ్‌తో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించిన ఐశ్వర్య లక్ష్మి ...లవ్ వెబ్‌సిరీస్‌తోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. సౌందర్య రజనీకాంత్‌కు కూడా ఇదే మొదటి సిరీస్ కావడం గమనార్హం.
సంబంధిత వార్తలు

Kayadu Lohar | స్టూడెంట్ లీడర్‌గా కయదు లోహర్ – నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో తమిళ సినిమా
సెప్టెంబర్ 26, 2026

Shruti Haasan | ఒంటిపై టాటూతో శృతి హాసన్ …అర్థం ఏమిటో తెలుసా?
సెప్టెంబర్ 25, 2026

OTT Releases | ఈ వీక్ ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఈ తెలుగు హారర్ మూవీ స్పెషల్
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి
- ●Ntr | సర్జరీ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ - రాజమౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా
- ●KTR | పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు
- ●Baanganga Gold & Diamonds | ఇన్వెస్టర్లకు అలర్ట్.. రూ.720 కోట్లకు ప్రముఖ కంపెనీ ఐపీఓ..
- ●Asian Games | కబడ్డీలో భారత్ పసిడి పంచ్.. ఇరాన్‌పై 40-34తో ఘన విజయం

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి

Ntr | సర్జరీ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ - రాజమౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా

KTR | పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు



