త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sobhita Dhulipala | ఇక్క‌డ ఏదీ శాశ్వ‌తం కాదు – ట్రోల్స్‌పై శోభిత‌ ధూళిపాళ రియాక్ష‌న్‌

త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై వ‌స్తోన్న ట్రోల్స్‌పై ఓ ఇంట‌ర్వ్యూలో శోభిత ధూళిపాళ రియాక్ట్ అయ్యింది. విమ‌ర్శ‌ల‌న్నీ తాత్కాలిక‌మ‌ని, ఇక్క‌డ ఏదీ శాశ్వ‌తం కాద‌ని చెప్పింది. విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోకుండా నా స్టైల్‌లో నేను జీవిస్తుంటాన‌ని అన్న‌ది.

N

Entertainment | Published On May 31, 2026, 4.57 pm IST

Sobhita Dhulipala | ఇక్క‌డ ఏదీ శాశ్వ‌తం కాదు – ట్రోల్స్‌పై శోభిత‌ ధూళిపాళ రియాక్ష‌న్‌
Advertisement

Sobhita Dhulipala | బాలీవుడ్ సినిమాల‌తో కెరీర్‌ను ప్రారంభించి ఆ త‌ర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అచ్చ తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ‌. తెలుగులో మేజ‌ర్‌, గూఢ‌చారి సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్‌తో ఆక‌ట్టుకుంది. అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డిన శోభిత 2024లో అత‌డిని పెళ్లి చేసుకుంది. వివాహం త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తోంది.
నాగ‌చైత‌న్య‌తో పెళ్లి, త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై వ‌స్తోన్న ట్రోల్స్‌పై ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో శోభిత ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. విమ‌ర్శ‌లు, ప్ర‌శంస‌లు ఏవైనా సినీ ప‌రిశ్ర‌మ‌లో తాత్కాలిక‌మేన‌ని, ఇక్క‌డ ఏదీ శాశ్వ‌తం కాద‌ని అన్న‌ది.

ఆస‌క్తి స‌హ‌జం...

"సెలిబ్రిటీల జీవితాల‌పై జ‌నాల్లో ఆస‌క్తి ఉండ‌టం స‌హ‌జ‌మే. వారి లైఫ్‌లో ఏం జ‌రుగుతుందో ప్ర‌తీదీ తెలుసుకోవాల‌నే ఉత్సుక‌త ఉంటుంది. కానీ జ‌నాల నా గురించి ఏమ‌నుకుంటున్నార‌న్న‌ది ప‌ట్టించుకోకుండా నా స్టైల్‌లో నేను జీవించ‌డం అల‌వాటు చేసుకున్నా. పెళ్లికి ముందుతో పోలిస్తే పెళ్లి త‌ర్వాత నా వ్య‌క్తిగ‌త జీవితంపై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ రెండేళ్ల‌లో ఎదురైన ప‌రిస్థితులు ఎంతో విలువైన పాఠాలు నేర్పించాయి. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌, ఆడియెన్స్‌లో నాపై ఉన్న భిన్న‌మైన అభిప్రాయాలు ...వేటి గురించి ప‌ట్టించుకోకుండా ప్ర‌శాంతంగా ఉండ‌టం అల‌వాటు చేసుకున్నా. కొన్ని విష‌యాల‌పై రియాక్ట్ కావ‌డం కంటే మౌనంగా ఉండ‌ట‌మే మంచిద‌ని మెళ్ల‌గా అర్థ‌మైంది. అందుకే వేటికి రియాక్ట్ కాను" అని శోభిత అన్న‌ది.

కాలంతో పాటే ....

"విమ‌ర్శ‌ల‌న్నీ వాతావ‌ర‌ణం లాంటివి. వెద‌ర్ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ఈ రోజు ఎండ‌ప‌డితే...రేపు వ‌ర్షం ప‌డొచ్చు. ట్రోల్స్‌, విమ‌ర్శ‌లు కూడా కాలంతో పాటే మారిపోతుంటాయి. అన్నీ తాత్కాలిక‌మే. ఇక్క‌డ ఏదీ శాశ్వ‌తం కాదు. నెగెటివిటీని త‌ట్టుకుని నిల‌బ‌డే శ‌క్తి, ఆత్మ‌స్థైర్యం ఉంటే స‌రిపోతుంది. నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, కెరీర్ త‌ప్ప మిగిలిన విష‌యాల‌న్నీ నాకు అవ‌స‌రం లేనివి. వాటి గురించి ఆలోచించి నా స‌మ‌యాన్ని వృథా చేసుకోను" అని అన్న‌ది.

విడాకుల త‌ర్వాత...

టాలీవుడ్ హీరోయిన్ స‌మంత‌ను పెళ్లి చేసుకున్న నాగ‌చైత‌న్య మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా 2022లో ఆమెకు విడాకులు ఇచ్చారు. విడాకుల త‌ర్వాత శోభిత‌తో నాగ‌చైత‌న్య ప్రేమ‌లో ప‌డిన‌ట్లు ప్ర‌చారం మొద‌లైంది. వీరిద్ద‌రు టూర్స్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.
డేటింగ్ రూమ‌ర్ల‌ను నిజం చేస్తూ 2024 ఆగస్ట్ లో నాగ‌చైత‌న్య‌, శోభిత‌ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఈ జంట పెళ్లి జ‌రిగింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య తెలుగులో వృష‌క‌ర్మ సినిమా చేస్తున్నాడు. మ‌రోవైపు శోభిత త‌మిళంలో పా రంజిత్ డైరెక్ష‌న్‌లో వ‌ట్టువ‌మ్ అనే సినిమా చేస్తోంది.

 

 

Advertisement
Advertisement