Sitara Ghattamaneni | మహేష్ కూతురు ర్యాంప్ వాక్ – సితార ఫొటోలు వైరల్
మహేష్‌బాబు కూతురు సితార ఘట్టమనేని ర్యాంప్ వాక్ చేసింది. ఓ జ్యూవెల్లరీ బ్రాండ్ ఈవెంట్‌కు సితార స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె ర్యాంప్ వాక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Feb 2, 2026, 3.39 pm IST
Sitara Ghattamaneni | మహేష్‌బాబు కూతురు సితార ఘట్టమనేని ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్‌తో మెరిసింది. సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో స్టార్స్‌కు మించిన ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అకౌంట్‌ను రెండు మిలియన్లకుపైనే ఫాలో అవుతున్నారు.సితార చేసే పోస్ట్‌లు చాలా సార్లు వైరల్ అయ్యాయి. ఎక్కువగా తండ్రి మహేష్‌బాబుతో ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది సితార.
ప్రస్తుతం సితార ఓ జ్యూవెల్లరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా పనిచేస్తోంది. ఇందుకోసం సితార కోటికిపైనే రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు వార్తలొచ్చాయి. ఈ రెమ్యూనరేషన్‌ను కూడా సేవా పనుల కోసమే ఉపయోగించి తండ్రికి తగ్గ తనయగా నిరూపించింది.
ర్యాంప్ వాక్...
తాజాగా సితార బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న జ్యూవెల్లరీ సంస్థ హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ను ఏర్పాటుచేసింది. ఈ ఈవెంట్‌లో ర్యాంప్ వాక్ చేసి ఆహుతులను ఆకట్టుకుంది సితార. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.
స్పెషల్ అట్రాక్షన్...
ట్రెడిషనల్, మోడ్రన్ కలబోసిన డ్రెస్టింగ్ స్టైల్‌తో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఈ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ర్యాంప్ వాక్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. కానీ ఎలాంటి బెరుకు లేకుండా కనిపించింది. ఆహుతులు అడిగిన కొన్ని ప్రశ్నలకు చకచకా సమాధానాలు ఇచ్చింది. సితార ర్యాంప్ వాక్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్నాయి.
ఓ వైపు చదువును కొనసాగిస్తూనే సితార యాక్టింగ్, కూచిపూడి వంటివి నేర్చుకుంటున్నట్లు సమాచారం. తండ్రి మహేష్‌బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా కోసం రూపొందించిన పెన్నీ అనే ప్రమోషనల్ సాంగ్‌లో సితార కనిపించింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



