Singer Chinmayi | మార్ఫింగ్ ఫొటోలతో వేధింపులు – పోలీసులకు చిన్మయి ఫిర్యాదు
సింగర్ చిన్మయి శ్రీపాద మార్ఫింగ్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన ఈ ఫొటోలపై సింగర్ చిన్మయి ఫైర్ అయ్యింది. డబ్బులు తీసుకొని తనను కొందరు తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
Entertainment | Published On Dec 11, 2025, 6.11 pm IST
సింగర్ చిన్మయి
Singer Chinmayi| సింగర్ చిన్మయి సినిమాల కంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ ద్వారానే గత కొన్నాళ్లుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినీ పరిశ్రమలోని లైంగిక వేధింపులతో గతంలో చిన్మయి చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. లిరిసిస్ట్ వైరముత్తు, సింగర్ కార్తిక్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులపై చిన్మయి ఆరోపణలు చేసింది. కేవలం ఇండస్ట్రీకే పరిమితం కాకుండా సొసైటీలో మహిళలు ఎదుర్కొనే వేధింపులు, అసమానతలపై చిన్మయి తన గళాన్ని విప్పుతుంటుంది. ఈ ట్వీట్స్, పోస్ట్‌ల కారణంగా చిన్మయిపై ప్రశంసల కంటే ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఫెనిమిస్ట్ అంటూ ఆమెపై ముద్రలు వేస్తున్నారు.
మార్ఫింగ్ ఫొటోలతో...
పెళ్లైనా ఆడవాళ్లు తాళిబొట్టు ధరించాలా వద్దా అన్నది వారి ఇష్టానికే వదిలేయాలంటూ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్ అప్పట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియా వేదికగా చిన్మయిపై పలువురు నెటిజన్లు అసభ్య కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు.ఈ ట్రోల్స్‌పై సజ్జనార్‌కు కంప్లైంట్ చేసింది.
తాజాగా చిన్మయి ఫొటోను ఓ నెటిజన్ అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ న్యూడ్ ఫొటో వైరల్ అయ్యింది. ఈ మార్ఫింగ్ ఫొటోలపై చిన్మయి ఫైర్ అయ్యింది. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నా మార్ఫింగ్ ఫొటో ఒకటి ట్విట్టర్‌లో కనిపించింది ఆ ట్విట్టర్ పేజీ అకౌంట్‌ను పోలీసులకు ట్యాగ్ చేశాను అని ఓ వీడియో ద్వారా చిన్మయి తెలిపింది. కొందరు డబ్బులు తీసుకొని తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఈ వీడియోలో చిన్మయి పేర్కొన్నది. గత కొద్ది వారాలుగా మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. నా పిల్లలు చనిపోవాలని కోరుకుంటున్నారని చిన్మయి అన్నది. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో తెలియదు. కానీ ఇలా వేధింపులకు పాల్పడే వారి బారి నుంచి అమ్మాయిలను, వారి కుటుంబాలను కాపాడటానికే ఈవీడియో చేశానని తెలిపింది. చిన్మయి కొందరు నెటిజన్లు సపోర్ట్ చేస్తుండా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.
I got a morphed image from a page today and tagged the cops - whether legal action happen will happen or not is not the issue
But I made this video for girls and their families to safeguard against the ‘Lanja Munda’ spewing people here who have been paid to do this for the past… pic.twitter.com/unjeJANNHP
— Chinmayi Sripaada (@Chinmayi) December 10, 2025
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



