Singer Chinmayi | కమల్‌హాసన్, రజనీకాంత్‌పై సింగర్ చిన్మయి విమర్శలు – మధ్యలోకి త్రిషను లాగిన నెటిజన్లు
కోలీవుడ్ అగ్ర హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్‌లను విమర్శిస్తూ సింగర్ చిన్మయి పెట్టిన పోస్ట్‌లు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వివాదంలోకి నెటిజన్లు త్రిషను లాగడం ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Mar 15, 2026, 10.48 am IST
Singer Chinmayi | సింగర్ చిన్మయి సినిమాలతో కంటే వివాదాలతో గత కొన్నేళ్లుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మహిళలపై వేధింపులు, సామాజిక సమస్యలపై చిన్మయి చేసిన ట్వీట్స్, పోస్ట్‌లు పలుమార్లు వైరల్ అయ్యాయి. తాజాగా కోలీవుడ్ అగ్ర హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్‌లను విమర్శిస్తూ చిన్మయి పోస్ట్‌లు పెట్టింది. ఆమె పోస్ట్‌లపై స్టార్ హీరోల అభిమానులు మండిపడుతున్నారు. చిన్మయిని ఏకిపడేస్తున్నారు.
వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు....
కోలీవుడ్ దిగ్గజ లిరిసిస్ట్ వైరమత్తుకు కేంద్రం జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు కమల్‌హాసన్, రజనీకాంత్ వైరముత్తును అభినందించారు. తమిళ సాహిత్యానికి వైరముత్తు గౌరవాన్ని తీసుకొచ్చారంటూ ప్రశంసించారు.
పురుషులు మన వైపు ఉండరు...
వైరముత్తును కమల్‌హాసన్, రజనీకాంత్‌లు అభినందించడంపై చిన్మయి ఫైర్ అయ్యింది. "సినిమా రంగం ద్వారా వచ్చిన పేరుప్రఖ్యాతులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వాళ్లు కూడా మహిళల గోడును వినిపించుకోవడం లేదు. గురువు చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యామని సాక్ష్యాధారాలతో నిరూపించినా కూడా ఏం పట్టనట్లుగా చెవిటివారిలా నటిస్తున్నారు. పురుషులు ఎప్పటికీ మన పక్షాన ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుపెట్టుకోవాలి" అంటూ కమల్‌హాసన్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేసింది చిన్మయి. వైరముత్తును అభినందిస్తూ రజనీకాంత్ పెట్టిన పోస్టుకు అసలు ఏం అర్థం కావడం లేదు అంటూ వ్యంగ్యంగా చిన్మయి రియాక్ట్ అయ్యింది.
సంగీతకు అన్యాయం...
చిన్మయి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. రజనీకాంత్, కమల్‌హాసన్ అభిమానులతో పాటు నెటిజన్లు చిన్మయిని తెగ ట్రోల్ చేస్తున్నారు. మధ్యలోకి త్రిషను లాగారు. "త్రిష కారణంగా దళపతి విజయ్ భార్య సంగీతకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించడం లేదు...త్రిష మీ స్నేహితురాలు కాబట్టి ఆమెను సపోర్ట్ చేస్తూ సైలెంట్‌గా ఉంటున్నారా" అంటూ చిన్మయిని నిలదీస్తున్నారు. చిన్మయి పెళ్లికి వైరముత్తు అటెండ్ అయిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు.
లైంగిక అరోపణలు...
కాగా వైరముత్తుపై గతంలో లైంగిక ఆరోపణలు చేసింది చిన్మయి. తనను వేధింపులకు గురిచేశాడంటూ చెప్పింది. ఈ ఆరోపణలు చేసినందుకు తనకు డబ్బింగ్ అసోసియేషన్ నుంచి బ్యాన్ చేయడమే కాకుండా సింగర్‌గా అవకాశాలు రాకుండా వైరమత్తు చేశాడంటూ పలుమార్లు చిన్మయి ట్వీట్స్ చేసింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



