Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ – తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ
తమన్నా బాలీవుడ్ మూవీ ది వాన్ కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. తాను కంపోజ్ చేసిన అయిగిరి నందిని అనే పాటను అనుమతి లేకుండా సినిమా ట్రైలర్‌లో వాడారని మ్యూజిక్ డైరెక్టర్ సర్గమ్ ఆరోపించారు. కాపీరైట్ ఉల్లంఘనపై తాను చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతోన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
Entertainment | Published On Sep 22, 2026, 5.54 pm IST
Tamannaah |తమన్నా బాలీవుడ్ మూవీ ది వాన్ వివాదంలో చిక్కుకుంది. తాను కంపోజ్ చేసిన పాటను అనుమతి లేకుండా సినిమాలో వాడుకున్నారంటూ ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపించారు. వాన్ మూవీ టీమ్‌పై చట్టప్రకారం పోరాటానికి సిద్దమవుతోన్నట్లు ప్రకటించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ది వాన్ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి పంచాయత్ వెబ్‌సిరీస్ ఫేమ్ దీపక్ కుమార్ మిత్రా, అర్నబ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రహస్యాలతో నిండిన ఓ అటవీ ప్రాంతం , ఆ ప్రాంత వాసులను కాపాడుతోన్న ఓ దేవత కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. వాన్ మూవీ ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఉపయోగించిన అయిగిరి నందిని అనే సాంగ్‌తో పాటు ట్యూన్ తాను కంపోజ్ చేసినవేనని ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ సర్గమ్ ఆరోపించారు. తన అనుమతి లేకుండా ఆ పాటను ట్రైలర్‌లో ఉపయోగించారని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.
షాకయ్యా....
"మూడేళ్లు కష్టపడి అయిగిరి నందిని పాటను కంపోజ్ చేశా. ఈ సాంగ్ రిలీజ్‌కు సంబంధించి ఓ మ్యూజిక్ సంస్థతో డీల్ కుదుర్చుకున్నా. కానీ నా పాట విడుదల కాకముందే ది వాన్ మూవీ ట్రైలర్‌లో కనిపించడం చూసి షాకయ్యా. నేను కంపోజ్ చేసిన సాంగ్ ఉన్నది ఉన్నట్లుగా ట్రైలర్‌లో వాడేశారు. వారి దగ్గరకు ఆ పాట ఎలా వెళ్లిందో... ఎవరూ దొంగిలించి వారికి ఇచ్చారో కూడా అర్థం కావడం లేదు" అని సర్గమ్ ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
సీబీఎఫ్‌సీ బోర్డ్ మెంబర్...
అంతే కాకుండా..."నా అనుమతి తీసుకోకుండా వాడిన ఆ పాటను ట్రైలర్ నుంచే కాకుండా సినిమా నుంచి తీసేయాలి. దీని వల్ల నాకు జరిగే నష్టానికి మేకర్స్ బాధ్యత వహించాలి. లేదంటే కాపీరైట్ ఉల్లంఘనల ప్రకారం లీగల్‌గానే సినిమా యూనిట్‌తో పోరాటం చేస్తాను" అని సర్గమ్ అన్నాడు. రిలీజ్ కాని పాటను ది వాన్ మేకర్స్ ఎలా ఉపయోగించారన్నది బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సర్గమ్ ఆరోపణలపై మూవీ దర్శకనిర్మాతలు రియాక్ట్ కాలేదు. కాగా సర్గమ్ ట్వీట్‌పై సీబీఎఫ్‌సీ బోర్డ్ మెంబర్ రిక్కీ కేజ్‌తో పాటు పలువురు రియాక్ట్ అయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ranbir Kapoor | వినాయకుడి ప్రసాదం వద్దన్న బాలీవుడ్ హీరో – బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్
సెప్టెంబర్ 17, 2026

Tamannaah | నా హీరోల్లో అతడే హ్యాండ్సమ్ – కియారా అద్వానీ భర్తపై తమన్నా పొగడ్తలు
సెప్టెంబర్ 17, 2026

Digangana | బాలీవుడ్ సినిమాకు రైటర్‌గా టాలీవుడ్ హీరోయిన్ – డైరెక్టర్‌గా పుష్ప కొరియోగ్రాఫర్
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Airtel | ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అదిరిపోయే బెనిఫిట్స్.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..
- ●Jagadeesh Reddy | వందల ఎకరాలు ఏడున్నయో రాధాకృష్ణ చెప్తే అమ్ముకుంటా
- ●ACB Raid RTO Bandlaguda Hyderabad | బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్‌పై ఏసీబీ మెరుపు దాడి.. అవినీతి బాగోతాలు బట్టబయలు
- ●Gold Price | బంగారం ధరలకు భారీ బూస్ట్.. రూ.3 లక్షలు దాటే ఛాన్స్?
- ●Asian Games 2026 | ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
- ●YTPS | యాదాద్రికి బొగ్గు కొరత.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

Airtel | ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అదిరిపోయే బెనిఫిట్స్.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..

Jagadeesh Reddy | వందల ఎకరాలు ఏడున్నయో రాధాకృష్ణ చెప్తే అమ్ముకుంటా

ACB Raid RTO Bandlaguda Hyderabad | బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్‌పై ఏసీబీ మెరుపు దాడి.. అవినీతి బాగోతాలు బట్టబయలు

Gold Price | బంగారం ధరలకు భారీ బూస్ట్.. రూ.3 లక్షలు దాటే ఛాన్స్?



