Kiara Advani | నా ఐస్‌క్రీమ్‌లు దొంగతనం చేసేది నువ్వే – కియారా అద్వానీకి ఫన్నీగా బర్త్‌డే విషెస్ చెప్పిన బాలీవుడ్ హీరో
కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఫన్నీగా బర్త్‌డే విషెస్ చెప్పాడు. తన ఐస్‌క్రీమ్‌లను కియారా దొంగిలిస్తుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సిద్దార్థ్ మల్హోత్రా పోస్ట్ వైరల్ అవుతోంది.
Entertainment | Published On Aug 1, 2026, 2.46 pm IST
Kiara Advani | బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకుంది. 34 ఏళ్లు పూర్తి చేసుకొని 35వ వసంతంలోకి అడుగుపెట్టింది. అయినా ఈ బ్యూటీ అందం రోజురోజుకు పెరుగుతోంది తప్పితే తగ్గడం లేదంటూ నెటిజన్లతో పాటు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెళ్లి తర్వాత హీరోయిన్ల క్రేజ్, స్టార్‌డమ్ తగ్గుతుంటాయి. కానీ కియారా మాత్రం బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ టాప్ హీరోలతో జోడీకడుతోంది.
వెరైటీగా...
కియారా అద్వానీ బర్త్‌డే సందర్భంగా భర్త సిద్ధార్హ్ మల్హోత్రా వెరైటీగా భార్యకు విషెస్ చెప్పాడు. "నా ఐస్ క్రీమ్‌లను దొంగతనం చేసే నువ్వే నా జీవితంలోని ప్రతి రోజును ఎంతో మధురంగా మారుస్తున్నావు. నా ప్రియమైన వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే" అంటూ ఫన్నీగా సోషల్ మీడియా ద్వారా కియారాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశాడు. కియారా ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో పింక్ కలర్ డ్రెస్‌లో కియారా ఐస్‌క్రీమ్ తింటూ కనిపిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా పోస్ట్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2023లో పెళ్లి...
2023లో కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈ జంట పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. పెళ్లికి ముందు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన షేర్షా మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరి మధ్య బంధం ప్రేమగా మారింది.
యశ్ టాక్సిక్‌లో...
ప్రస్తుతం యశ్ టాక్సిక్ కియారా అద్వానీ హీరోయిన్ నటిస్తోంది. నాదియా అనే బోల్డ్ రోల్‌లో కనిపించబోతుంది. ఈ సినిమా కోసం కియారా అద్వానీ పదిహేను కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కన్నడ ఇండస్ట్రీలోనే ఓ సినిమా కోసం అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కథానాయికగా టాక్సిక్‌తో కియారా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కియారా అద్వానీతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Happy birthday to the one who makes every day a little sweeter…even when she’s stealing my ice cream ❤️😉 @advani_kiara pic.twitter.com/D2xyDhc5wK
— Sidharth Malhotra (@SidMalhotra) July 31, 2026
తాజావార్తలు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!






