Nayanthara | రజనీకాంత్ ఏరియాలో కొత్త ఇల్లు కొన్న నయనతార – లగ్జరీ డూప్లెక్స్ ధర వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
లేడీ సూపర్ స్టార్ నయనతార చెన్నైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. దాదాపు 31.5 కోట్లతో పోయెస్ గార్డెన్ ఏరియాలో నయనతార కాస్ట్‌లీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇదే ఏరియాలో ప్రస్తుతం రజనీకాంత్, ధనుష్‌తో పాటు మరికొందరు సెలిబ్రిటీలు ఉంటున్నారు.
Nayanthara | ఓ హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటిపోయిందంటే ఆమె కెరీర్ క్లోజ్ అయినట్లే. హీరోయిన్ పాత్రలు తగ్గించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నయనతార కథానాయికగా అరంగేట్రం చేసి ఇరవై మూడేళ్లు దాటింది. అయినా దక్షిణాదిలో నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. రోజుకురోజుకు ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఎంత మంది యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయన్‌ను మాత్రం బీట్ చేయలేకపోతున్నారు.
ఎనిమిది సినిమాలు...
ప్రస్తుతం నయనతార దక్షిణాదిలో ఆరు సినిమాలు చేస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన ఓ బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా కనిపించబోతుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు పదమూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ స్వీకరిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో నయన్ ఉంది.
పోయెస్ గార్డెన్ ఏరియాలో...
తాజాగా నయన్ చెన్నైలో కొత్త ఇల్లు కొన్నది. చెన్నైలోని పోయెస్ గార్డెన్ ఏరియాలో 31.5 కోట్లతో ఖరీదైన డూప్లెక్స్ అపార్టెంట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఇంటీరియర్ డెకరేషన్‌తో కలిపి ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కాస్ట్ 35 కోట్లు దాటినట్లు చెబుతోన్నారు.
రజనీకాంత్...ధనుష్...
పోయెస్ గార్డెన్ ఏరియాలో ప్రస్తుతం రజనీకాంత్, ధనుష్ తో పాటు మరికొందరు సెలిబ్రిటీలు నివసిస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం కూడా అదే ఏరియాలో ఉండేది. ఇప్పుడు పోయెస్ గార్డెన్ ఏరియాలో నయనతార ఇల్లు కొనడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే భర్త, పిల్లలతో కలిసి ఈ ఇంటికి నయనతార షిప్ట్ కానున్నట్లు సమాచారం.
యశ్ టాక్సిక్...
కాగా ప్రస్తుతం యశ్ టాక్సిక్‌లో నయనతార ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో బోల్డ్ రోల్‌లో కనిపించబోతుంది. ఈ కన్నడ మూవీ ఆగస్ట్ 26న రిలీజ్ కాబోతుంది. టాక్సిక్‌కు పది రోజుల ముందు నయనతార కథానాయికగా నటించిన తమిళ మూవీ హాయ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 14న విడుదల కానున్న ఈ సినిమాలో కెవిన్ హీరోగా నటిస్తున్నాడు. కాంచన 4తో పాటు నయన్ హీరోయిన్‌గా నటించిన మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






