Kiara Advani | నాదియా…బోల్డ్ అండ్ బ్యూటీపుల్ – కియారా బర్త్‌డే ట్రీట్ అదుర్స్
కియారా అద్వానీ బర్త్‌డే సందర్భంగా టాక్సిక్ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌గా కియారా కనిపిస్తోంది. టాక్సిక్‌లో నాదియాగా గ్లామర్, మిస్టరీ అంశాల కలబోతగా ఈ బాలీవుడ్ బ్యూటీ క్యారెక్టర్ ఉండబోతున్నట్లు సమాచారుం.
Entertainment | Published On Jul 31, 2026, 4.44 pm IST
Kiara Advani | కియారా అద్వానీ బర్త్‌డే సందర్భంగా టాక్సిక్ మేకర్స్ ఆమెకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. స్పెషల్ పోస్టర్‌తో ఆమెకు విషెస్ చెప్పారు. కేజీఎఫ్ ఫేమ్ యశ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియన్ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌కు జోడీగా టాక్సిక్‌లో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, కియారా అద్వానీతో పాటు హ్యూమా ఖురేషి కథానాయికలుగా కనిపించబోతున్నారు.
నాదియా...
కియారా అద్వానీ బర్త్‌డే సందర్భంగా ఆమె పోస్టర్‌ను టాక్సిక్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాదియా అనే పాత్రలో ఈ బాలీవుడ్ బ్యూటీ కనిపించబోతున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టర్‌లో రెడ్ కలర్ డ్రెస్‌లో కియారా అద్వానీ స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఆమె చూపుల్లోని ఇంటెన్సిటీ, రూబీ లిప్స్, రాయల్ లుక్ పోస్టర్‌కు హైలైట్‌గా నిలుస్తున్నాయి. బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ అంటూ కియారా లుక్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా ఆమె పాత్ర చాలా మిస్టరీయస్‌గా ఉండబోతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారు.
ఇంటిమేట్ సీన్లు...
ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్‌లో యశ్, కియారా కెమిస్ట్రీ, ఇంటిమేట్ సీన్లు నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. ఈ పాట విషయంలో కియారాపై విమర్శలు కూడా చాలానే వచ్చాయి. పెళ్లై ఓ కూతురు ఉన్న హీరోయిన్ ఈ రేంజ్‌లో అందాల ఆరబోయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో కొందరు ఈ బాలీవుడ్ బ్యూటీని ట్రోల్ చేశారు. రెమ్యూనరేషన్ కోసమే ఇలాంటి బోల్డ్ రోల్స్‌ను కియారా అంగీకరిస్తుందంటూ ట్రోల్ చేశారు. వీటిపై కియారా మాత్రం రియాక్ట్ కాలేదు.
ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌లో...
తెలుగులో ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గాడ్ ఆఫ్ వార్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ తర్వాత ఈ బాలీవుడ్ హీరోయిన్ చేస్తోన్న మూడో తెలుగు మూవీ ఇది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
సెప్టెంబర్ 9, 2026

Toxic Movie | టాక్సిక్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీ రైట్స్ విషయంలో దారుణంగా..!
సెప్టెంబర్ 7, 2026

NTR Movie | ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్.. ఇద్దరు భామలతో స్పెషల్ సాంగ్‌కు ప్లాన్!
సెప్టెంబర్ 6, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | జీవో 81, 85లు నకిలీ అయితే.. సీఎం రేవంత్, మంత్రులు కూడా నకిలీలే
- ●Cabinet Decisions | ఏపీ, తెలంగాణలో రైల్వే విస్తరణ.. రూ. 10,021 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- ●Komatireddy Venkat Reddy | సీఎంను ఏకవచనంతో సంబోధించడమా..? మనం ఏ యుగంలో ఉన్నాం..?
- ●Apple | నేడే యాపిల్ ఈవెంట్.. ఎలా వీక్షించాలి.. సమయం ఎప్పుడు..?
- ●Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!
- ●E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి

RS Praveen Kumar | జీవో 81, 85లు నకిలీ అయితే.. సీఎం రేవంత్, మంత్రులు కూడా నకిలీలే

Cabinet Decisions | ఏపీ, తెలంగాణలో రైల్వే విస్తరణ.. రూ. 10,021 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Komatireddy Venkat Reddy | సీఎంను ఏకవచనంతో సంబోధించడమా..? మనం ఏ యుగంలో ఉన్నాం..?

Apple | నేడే యాపిల్ ఈవెంట్.. ఎలా వీక్షించాలి.. సమయం ఎప్పుడు..?



