Ramchandar Rao | E20 పెట్రోల్ పూర్తి సురక్షితం.. నిర్భయంగా పోయించుకోండి
Ramchandar Rao | E20 పెట్రోల్ పూర్తి సురక్షితమని.. BIS ప్రమాణాలకు అనుగుణంగా, లోతైన పరీక్షలు చేసిన తరువాతే దీన్ని అమలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. వదంతులను వదిలేసి ప్రజలు వాస్తవాలను నమ్మాలని సూచించారు.
- వదంతులు వదిలేసి వాస్తవాలనే నమ్మండి
- ఎక్స్ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విజ్ఞప్తి
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: E20 పెట్రోల్ పూర్తి సురక్షితమని.. BIS ప్రమాణాలకు అనుగుణంగా, లోతైన పరీక్షలు చేసిన తరువాతే దీన్ని అమలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. వదంతులను వదిలేసి ప్రజలు వాస్తవాలను నమ్మాలని సూచించారు. ఇటీవల పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలిపిన E20 ఇంధనం వాడకంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అపోహలను నమ్మొద్దన్నారు.నిర్భయంగా E20 పెట్రోల్‌ను పోయించుకోవాలని కోరారు. E20 కేవలం ఇంధనం మాత్రమే కాదని.. ఆత్మనిర్భర్ భారత్, స్వచ్ఛమైన పర్యావరణం, రైతుల శ్రేయస్సు దిశగా వేసిన ఒక మహత్తర ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఈమేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
E20 పెట్రోల్ వల్ల అనేక లాభాలున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమ, శాస్త్రవేత్తలు, చమురు కంపెనీలతో సుదీర్ఘ చర్చల తర్వాతే దీన్ని తెచ్చారు. ల్యాబొరేటరీ, ఫీల్డ్ ట్రయల్స్ ద్వారా E20 ఇంధనం పూర్తిగా సురక్షితమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది. విదేశీ మారక ద్రవ్యంలో రూ.1.90 లక్షల కోట్లకు పైగా ఆదా చేసుకోవచ్చు. 93 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించవచ్చు. రైతులకు రూ.1.60 లక్షల కోట్లకు పైగా ఆదాయం ఆదా అయ్యే అవకాశం ఉంది అని రాంచందర్‌రావు తెలిపారు.
ఇథనాల్ తయారీకి మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యాలను వాడుతుండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రైతుల ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల వేల కోట్ల రూపాయల ముడి చమురు దిగుమతి భారం తగ్గి దేశ ఖజానా ఆదా అవుతోంది. E20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. పాత వాహనాల్లో మైలేజ్ స్వల్పంగా తగ్గినప్పటికీ, పర్యావరణ అనుకూల భవిష్యత్తు కోసం దీన్ని ప్రతిఒక్కరూ స్వీకరించాలని అని ఆయన కోరారు.
సంబంధిత వార్తలు

Hyderabad | ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత
ఆగస్టు 7, 2026

Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు – ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
ఆగస్టు 7, 2026

Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
- ●Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది.. బావ, బామ్మర్దులిద్దరూ దౌర్భాగ్యులే
- ●Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్
- ●Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!
- ●JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..
- ●Joginapally Santhosh Kumar | వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 2000 వేల మొక్కలు నాటిన సంతోష్‌కుమార్

Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది.. బావ, బామ్మర్దులిద్దరూ దౌర్భాగ్యులే

Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్

Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!



