త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana | రామాయ‌ణపై మ‌రో ట్విస్ట్ – ఓటీటీలో డ‌బ్బులు పెట్టి చూడాల్సిందే – బ‌డ్జెట్ క‌ష్టాలే కార‌ణ‌మా?

రామాయ‌ణ ఓటీటీ రిలీజ్‌లో మేక‌ర్స్ ట్విస్ట్ ఇచ్చారు. థియేట‌ర్ల‌లో విడుద‌ల కావ‌డానికి ముందే ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్న‌ది. ఓటీటీలో ఈ సినిమా ఫ్రీగా చూసేందుకు అవ‌కాశం ఉండ‌ద‌ని ప్ర‌క‌టించారు. ఫే ఫ‌ర్ వ్యూ విధానంలో ఈ మైథాల‌జీ మూవీని రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు.

N

Entertainment | Published On Oct 22, 2026, 2.22 pm IST

Ramayana | రామాయ‌ణపై మ‌రో ట్విస్ట్ – ఓటీటీలో డ‌బ్బులు పెట్టి చూడాల్సిందే – బ‌డ్జెట్ క‌ష్టాలే కార‌ణ‌మా?
Advertisement

Ramayana |  రామాయ‌ణ సినిమాకు పెట్టిన బ‌డ్జెట్‌ను వెన‌క్కి రాబ‌ట్టేందుకు మేక‌ర్స్ ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోన్నారు. నాలుగు వేల కోట్ల‌తో రెండు పార్ట్‌లుగా రూపొందిన ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్‌లో మెలిక పెట్టారు. రామాయ‌ణ గాథ ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ య‌శ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ఐదు భాష‌ల్లో...

న‌వంబ‌ర్ 5న పాన్ ఇండియా వైడ్‌గా ఐదు భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కాగా విడుద‌ల‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. అయితే ఓటీటీలో ఈ సినిమా చూడ‌టానికి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఒక్క‌టే ఉంటే స‌రిపోదు. అద‌నంగా డ‌బ్బులు కూడా చెల్లించాల్సిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రామాయ‌ణ మేక‌ర్స్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్ర‌క‌టించింది.

పే ఫ‌ర్ వ్యూ...

బెస్ట్ క్వాలిటీతో ఆడియెన్స్‌కు మంచి విజువ‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను ఇవ్వాల‌నే ఆలోచ‌న‌తోనే పే ఫ‌ర్ వ్యూ విధానంలో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని అన్నారు. థియేట‌ర్ల‌లో స్క్రీనింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఈ మైథాల‌జీ మూవీ ఓటీటీలోకి వ‌స్తుంద‌ని తెలిపారు.

నాలుగు వేల కోట్లు...

రామాయ‌ణ రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కుతోంది. దాదాపు నాలుగు వేల కోట్ట బ‌డ్జెట్‌తో రూపొందిస్తోన్నారు. థియేట్రిక‌ల్ ర‌న్‌తో పెట్టిన బ‌డ్జెట్ మొత్తం రిక‌వ‌రీ కావ‌డం క‌ష్టం కావ‌డంతోనే మేక‌ర్స్ పే ఫ‌ర్ వ్యూ విధానంలో రిలీజ్ చేసేలా ఓటీటీ సంస్థ‌తో డీల్ కుద‌ర్చుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. బ‌డ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ప్రొడ్యూస‌ర్‌గా...

రామాయ‌ణ మూవీలో రాముడిగా ర‌ణ‌బీర్‌క‌పూర్ క‌నిపించ‌బోతుండ‌గా...సీత పాత్ర‌ను సాయిప‌ల్ల‌వి పోషిస్తోంది. రావ‌ణాసురుడిగా య‌శ్ న‌టిస్తోన్నారు. విల‌న్‌గా న‌టిస్తూనే ఈ సినిమాకు కో ప్రొడ్యూస‌ర్‌గా కూడా య‌శ్ వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. స‌న్నీడియోల్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

 

Advertisement
Advertisement