Rashmika Mandanna | జాన్వీకపూర్ పెద్ది వివాదంపై రష్మిక రియాక్షన్ – “నో” చెప్పడం తప్పుకాదన్న విజయ్ దేవరకొండ
పెద్దిలో జాన్వీకపూర్ పాత్రపై వచ్చిన విమర్శలపై కాఫి విత్ కరణ్ షోలో రష్మిక మందన్న రియాక్ట్ అయ్యింది. గ్లామర్ రోల్స్ విషయంలో తనకంటూ కొన్ని హద్దులు విధించుకున్నట్లు చెప్పింది.తన లిమిట్స్‌ను గౌరవించే దర్శకులతోనే పనిచేస్తానని అన్నది.
Entertainment | Published On Oct 22, 2026, 12.58 pm IST
Rashmika Mandanna | పెద్ది సినిమాలో జాన్వీకపూర్ పాత్రను ఆవిష్కరించిన తీరు వివాదాస్పదమైంది. కథలో ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా కేవలం గ్లామర్ కోసమే ఆమె పాత్రను వాడుకోవడం, క్లోజప్ షాట్స్, లిప్‌లాక్‌లపై దారుణంగా విమర్శలొచ్చాయి. ఈ వివాదంపై బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల హీరోయిన్లు ఫైర్ అయ్యారు. చివరకు డైరెక్టర్ బుచ్చిబాబు సానా సారీ చెప్పిన కూడా వివాదం సద్దుమణగలేదు. ఈ విమర్శల కారణంగా రిలీజ్ తర్వాత పెద్ది ప్రమోషన్స్‌కు జాన్వీకపూర్ దూరమైంది.
రష్మిక రియాక్షన్....
తాజాగా పెద్ది కాంట్రవర్సీపై రష్మిక మందన్న రియాక్ట్ అయ్యింది. భర్త విజయ్ దేవరకొండతో కలిసి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో రష్మిక మందన్న పాల్గొన్నది. పెద్ది సినిమాలోని సీన్లపై జాన్వీ ఇబ్బందిగా ఫీలై ఉంటుందని కరణ్ జోహార్ అన్నాడు. అలాంటి పాత్రల విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని రష్మికను కరణ్ జోహార్ అడిగాడు.
హద్దులు పాటిస్తా....
"కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపించాల్సివుంటుంది. అందులో తప్పులేదు. కానీ దానిని సాకుగా పెట్టుకొని మితిమిరిన స్కిన్‌షో, ఎక్స్‌పోజింగ్ చేయాలనే రూల్‌కు నేను వ్యతిరేకం. గ్లామర్ రోల్స్ విషయంలో నాకంటూ కొన్ని నిర్ధిష్టమైన హద్దులు ఉన్నాయి. వాటికి లోబడే సినిమాలు చేస్తాను. కొన్ని సార్లు పాత్రలు, సన్నివేశాలకు అనుగుణంగా బికినీ లాంటివి ధరించాల్సివస్తుంది. అలాంటివి నాకు కంఫర్టబుల్‌గా అనిపించవు. అదే విషయాన్ని దర్శకులతో చెప్పడానికి మొహమొటపడను. నా లిమిట్స్‌ను గౌరవించే దర్శకులతోనే పనిచేయడానికి ఇష్టపడను" అని రష్మిక అన్నది. సినిమాల పరంగా నాకు ఇబ్బందిగా అనిపించిన విషయాలను విజయ్‌తో డిస్కస్ చేస్తుంటానని, ఏదైనా తనతో షేర్ చేసుకోవచ్చునని చెప్పి నాలో ధైర్యాన్ని నింపుతుంటాడని భర్తపై రష్మిక ప్రశంసలు కురిపించింది.
నో చెప్పడం తప్పుకాదు...
సినిమా అంగీకరించినంత మాత్రానా ఇష్టం లేకపోయినా హీరోయిన్ స్కిన్ షో చేయాల్సిన అవసరం లేదని విజయ్ దేవరకొండ అన్నాడు. కంఫర్టబుల్‌గా అనిపించని సీన్లు చేయనని చెప్పడంలో తప్పులేదని పేర్కొన్నాడు. వీరిద్దరి కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hansika | గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హన్సిక – డీ గ్లామర్ లుక్‌లో కోలీవుడ్ బ్యూటీ
అక్టోబర్ 21, 2026

Naga Chaitanya | రిలీజ్ డేట్ చెప్పేశారు – షూటింగ్ మాత్రం పెండింగ్ – నాగచైతన్య వృషకర్మపై అప్డేట్
అక్టోబర్ 21, 2026

Yellamma Movie | ప్రభాస్ ‘స్పిరిట్’ ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’
అక్టోబర్ 20, 2026
తాజావార్తలు
- ●PHP Vulnerability | పీహెచ్పీలో తీవ్ర భద్రతా లోపాలు.. వెబ్సైట్లకు సైబర్ ముప్పు..
- ●Mahesh Goud | ప్రజా తిరుగుబాటుకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న: మహేశ్ కుమార్ గౌడ్
- ●China Population Collapse | చైనా జనాభా పతనం భారత్‌తో యుద్ధానికి దారితీస్తుందా? తైవాన్ కంటే మన దేశమే ఎందుకు టార్గెట్?
- ●Shashi Tharoor | నేనేమీ ట్రావెల్ ఏజెంట్‌ను కాదు.. రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ వ్యాఖ్యలు
- ●Dharmapuri Arvind | ఒకరినొకరు కాపాడుకుంటున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి: ఎంపీ ధర్మపురి అరవింద్
- ●Reliance Industries | జియో ఐపీఓకు భారీ స్పందన.. అయినా పతనంలో రిలయన్స్ షేరు..

PHP Vulnerability | పీహెచ్పీలో తీవ్ర భద్రతా లోపాలు.. వెబ్సైట్లకు సైబర్ ముప్పు..

Mahesh Goud | ప్రజా తిరుగుబాటుకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న: మహేశ్ కుమార్ గౌడ్

China Population Collapse | చైనా జనాభా పతనం భారత్‌తో యుద్ధానికి దారితీస్తుందా? తైవాన్ కంటే మన దేశమే ఎందుకు టార్గెట్?

Shashi Tharoor | నేనేమీ ట్రావెల్ ఏజెంట్‌ను కాదు.. రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ వ్యాఖ్యలు



