Meenakshi Chaudhary | తెలుగు వెబ్‌సిరీస్‌లో మీనాక్షి చౌదరి – డీజే టిల్లు హీరోతో రొమాన్స్
తెలుగులో ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేయబోతుంది మీనాక్షి చౌదరి. లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రధారిగా ఓ యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ తెరకెక్కబోతుంది. ఈ సిరీస్‌లో సిద్దు జొన్నలగడ్డకు జోడీగా మీనాక్షి చౌదరి కనిపించబోతుంది.
Entertainment | Published On Apr 21, 2026, 3.47 pm IST
Meenakshi Chaudhary | వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లక్కీ భాస్కర్ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ సూపర్ హిట్ మూవీలో గ్లామర్ రోల్‌లో కాకుండా ఓ చిన్నారికి తల్లిగా నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ రాబోతుంది. అయితే సినిమా కాదు. వీరిద్దరు కలిసి ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నారు. ఇండియాలో జరిగిన ఓ బిగ్గెస్ట్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా వెంకీ అట్లూరి ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారు. ఈ సిరీస్‌లో సిద్దు జొన్నలగడ్డ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. అతడికి జోడీగా మీనాక్షి చౌదరి కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. లక్కీ భాస్కర్‌తో తనకు పెద్ద హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి దర్శకుడు కావడంతో కథ వినకుండానే ఈ సిరీస్‌లో నటించడానికి మీనాక్షి ఓకే చెప్పిందట.
ఆగస్ట్ నుంచి షూటింగ్...
ఇందులో సిద్దు జొన్నలగడ్డ, మీనాక్షి రోల్స్ పవర్‌ఫుల్‌గా సాగుతాయట. ప్రస్తుతం ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోన్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో వెంకీ అట్లూరి బిజీగా ఉన్నాడు. జూలైలో ఈ పాన్ ఇండియన్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఆగస్ట్ నుంచి సిద్దు జొన్నలగడ్డ, వెంకీ అట్లూరి మూవీ వెబ్‌సిరీస్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
ఫస్ట్ సిరీస్...
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ తెలుగు వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తుంది. మీనాక్షి చౌదరి నటిస్తోన్న ఫస్ట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఓవరాల్‌గా రెండోది. గతంలో హిందీలో అవుట్ ఆఫ్ లవ్ అనే వెబ్ సిరీస్ చేసింది.
ఈ ఏడాది సంక్రాంతికి అనగనగా ఒక రాజు మూవీతో పెద్ద హిట్‌ను అందుకుంది మీనాక్షి చౌదరి. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం నాగచైతన్య వృషకర్మ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించబోతున్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Meenakshi Chaudhary | నేను 18 గంటలు పని చేశా.. మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
మే 20, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



