Shruti Haasan | ప్రభాస్ సలార్ 2 ఆగిపోయిందా? ….శృతి హాసన్ కామెంట్స్‌తో ఫ్యాన్స్‌లో టెన్షన్!
ప్రభాస్ సలార్ 2 మూవీపై హీరోయిన్ శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సీక్వెల్ ఉంటుందో లేదో తనకు తెలియదని అన్నది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ నుంచి తనను ఎవరూ అప్రోచ్ కాలేదని పేర్కొన్నది.
Entertainment | Published On Mar 22, 2026, 11.16 am IST
Shruti Haasan | ప్రస్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఓ సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్‌ను అనౌన్స్‌చేయడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. అనౌన్స్‌చేసిన సీక్వెల్స్‌లో చాలా వరకు పట్టాలెక్కడం లేదు. పార్ట్ వన్ అంచనాలకు తగ్గట్లుగా ఆడకపోవడం, హీరోల బిజీతో పాటు ఇతర కారణాల వల్ల చాలా సీక్వెల్ సినిమాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఆగిపోయిన సీక్వెల్స్ సినిమాల లిస్ట్‌లో ప్రభాస్ సలార్ 2 కూడా చేరినట్లు గత కొద్ది నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
శృతి హాసన్ కామెంట్స్...
తాజాగా సలార్ 2పై శృతి హాసన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. సలార్ 2 ఆగిపోయిందంటూ ఇన్‌డైరెక్ట్‌గా శృతి హాసన్ హింట్ ఇచ్చేసిందని నెటిజన్లు అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో సలార్, కూలీ రిజల్ట్ విషయంలో హ్యాపీగా ఉన్నానని శృతి హాసన్ అన్నది. . సలార్ 2 ఎప్పుడు మొదలుకాబోతుందని అడిగిన ప్రశ్నకు అసలు ఈ సినిమా ఉంటుందో లేదో తనకు తెలియదు అంటూ బదులిచ్చింది శృతి హాసన్.
ఎలాంటి అప్‌డేట్ లేదు...
"సలార్ 2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా లార్జర్‌దేన్ లైఫ్‌గా ఉండబోతుందని అందరూ అంటున్నారు. నాకైతే ఈ సీక్వెల్ గురించి ఏం తెలియదు. అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవ్వవచ్చు...పార్ట్2 ఎలా ఉండబోతుంది? ఏవిధమైన మార్పులు చేస్తున్నారనేదానిపై ఎలాంటి అవగాహన లేదు. సలార్ 2 కోసం ఇప్పటివరకు మేకర్స్ నుంచి నన్ను ఎవరూ అప్రోచ్ కాలేదు. షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎప్పుడు పిలిచినా షూటింగ్‌లో పాల్గొనడానికైతే నేను రెడీగా ఉన్నా" అని శృతి హాసన్ అన్నది. ఇన్‌డైరెక్ట్‌గా ఈ సీక్వెల్ తెరకెక్కడం డౌట్ అని శృతి హాసన్ అన్నదని నెటిజన్లు చెబుతున్నారు.
ఉగ్రమ్ రీమేక్‌గా...
సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. కన్నడ మూవీ ఉగ్రమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా 700 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. కానీ స్టోరీతో పాటు ప్రశాంత్ నీల్ టేకింగ్ విషయంలో మాత్రం విమర్శలొచ్చాయి. దాంతో సీక్వెల్‌పై అనుమానాలు మొదలయ్యాయి.
మరోవైపు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మాత్రం సలార్ 2 ఉంటుందని చెబుతూ వస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. డ్రాగన్ పూర్తయిన తర్వాత సలార్ 2 షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



