Shruti Haasan | ఆ ప్రశ్న అడగొద్దు – పెళ్లిపై శృతి హాసన్ సీరియస్ కామెంట్స్ – నెటిజన్‌కు వార్నింగ్
పెళ్లి గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కమల్ హాసన్ తనయ శృతి హాసన్ సీరియస్‌గా బదులిచ్చింది. పెళ్లి ఎప్పుడూ అంటూ ఇకపై నన్ను అడగొద్దంటూ చెప్పింది. ఆమె రిప్లై వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jul 24, 2026, 5.52 pm IST
Shruti Haasan | పెళ్లిపై కమల్ హాసన్ తనయ శృతి హాసన్ ఆసక్తికర కామెంట్లు చేసింది. ఇటీవలే ఈ చెన్నై బ్యూటీ నలభై ఏళ్లు పూర్తిచేసుకొని నలభై ఒక్కటవ వసంతంలోకి అడుగుపెట్టింది. సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. గత ఇరవై ఏళ్లుగా ముంబైలో సెటిలైన ఈ బ్యూటీ ఇటీవలే చెన్నైకి షిప్టయ్యింది. కొత్త ఇల్లు కొన్నది. నూతన గృహ ప్రవేశ వేడుకల తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెళ్లి కోసమేనా?
సినీ కెరీర్ ఆశాజనకంగా సాగకపోవడంతో వ్యక్తిగత జీవితంపై శృతి హాసన్ ఫోకస్ పెట్టిందని టాక్ వినిపిస్తోంది. పెళ్లి చేసుకునే ఆలోచనతోనే ఆమె చెన్నైకి మకాం మార్చినట్లు వార్తలొస్తున్నాయి. ఈ పెళ్లి రూమర్లపై శృతి హాసన్ క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది శృతి హాసన్. తన అప్‌కమింగ్ మూవీస్‌తో పాటు కొత్త ఇంటి విశేషాలను వెల్లడించింది. ఈ సందర్భంగా పెళ్లి గురించి ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా అంటూ శృతి హాసన్‌ను ఓ నెటిజన్ ప్రశ్న అడిగాడు.
సీరియస్ ఆన్సర్...
సదరు నెటిజన్ ప్రశ్నకు సీరియస్‌గా బదులిచ్చింది కమల్ తనయ. "ఇకనైనా ఆ ప్రశ్న అడగటం మానేయండి" అంటూ రిప్లై ఇచ్చింది. "పెళ్లి గురించి నన్ను చాలా సార్లు అడిగారు. నేను బదులిచ్చాను. ఆ ప్రశ్న విని విని బోర్ కొట్టింది. ఇకనైనా పెళ్లి ఎప్పుడు అంటూ నన్ను అడగటం మానేస్తే మీకు మంచిది. నాకు మంచిది" అంటూ చెప్పింది. ఆమె సమాధానం వైరల్ అవుతోంది.
డేటింగ్...
డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో ప్రేమలో పడిన శృతి హాసన్ అతడితో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. మనస్పర్థల కారణంగా అతడితో తెగతెంపులు చేసుకుంది.
ఇటీవలే రామ్‌చరణ్ పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్‌లో నటించింది శృతి హాసన్. ఈ ఐటెంసాంగ్ ఆమె కెరీర్‌కు పెద్దగా హెల్పవ్వలేదు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న తెలుగు మూవీ ఆకాశంలో ఒక తారలో బోల్డ్ రోల్ చేస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramayana Trailer | విద్యార్థుల నిరసనల ఎఫెక్ట్ – రామాయణ ట్రైలర్ వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా?
జులై 24, 2026

Ayesha Khan | ధురంధర్ ఫేమ్ ఆయేషా ఖాన్ అరెస్ట్..! అసలు ఏం జరిగిందంటే..?
జులై 22, 2026

Aishwarya Lekshmi | రూ.100కోట్లు ఇచ్చినా సోషల్ మీడియా జోలికి వెళ్లను.. తేల్చి చెప్పిన మల్లు బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి..!
జులై 22, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- ●KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..
- ●CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- ●Rakul Preet Singh | సినిమా బడ్జెట్ 1100 కోట్లు - రకుల్ రెమ్యూనరేషన్ కోటి
- ●Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. తెరపైకి ప్రత్యేక బ్యూరో

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..

CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు



