Shriya | శ్రియా తమిళ మూవీకి తొలిరోజు ఆరు లక్షల కలెక్షన్స్ – బెస్ట్ ఫిల్మ్‌గా ప్రభుత్వం అవార్డ్ ఇవ్వడంపై ట్రోల్స్
శ్రియా హీరోయిన్‌గా నటించిన సందకారి మూవీ కోలీవుడ్ హిస్టరీలోనే అతి తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాగా చెత్త రికార్డును క్రియేట్ చేసింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమా తొలిరోజు థియేటర్లలో కేవలం ఆరు లక్షల కలెక్షన్స్ మాత్రమే దక్కించుకుంది. ఈ ఏడాది ఆరంభంలో సందకారి సినిమాకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ సినిమాగా అవార్డును ఇచ్చింది.
Entertainment | Published On Sep 20, 2026, 5.30 pm IST
Shriya | హీరోయిన్ శ్రియా తమిళ మూవీ సందకారికి తొలిరోజే కోలీవుడ్ ప్రేక్షకులు పెద్ద షాకిచ్చారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ కోలీవుడ్ హిస్టరీలోనే అతి తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సందకారి మూవీలో విమల్, శ్రియా హీరోహీరోయిన్లుగా నటించారు. మలయాళ మూవీ మై బాస్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఆర్ మాధేష్ దర్శకత్వం వహించారు.
2019లో షూటింగ్ పూర్తి...
2019లోనే సందకారి షూటింగ్ పూర్తయ్యింది. అనివార్య కారణాల దాదాపు ఏడేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తమిళ ఆడియెన్స్ అస్సలు పట్టించుకోలేదు. తొలిరోజు అతి కష్టంగా ఆరు లక్షల వసూళ్లను రాబట్టింది. పోస్టర్ల ప్రింట్ ఖర్చులు కూడా రాలేదని ట్రేడ్ వర్గాలు అంటోన్నాయి. స్టార్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమాల్లో తమిళంలో అతి తక్కువ వసూళ్లను దక్కించుకున్న సినిమాగా సందకారి చెత్త రికార్డును మూటగట్టుకుంది. మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమాకు పది లక్షల కలెక్షన్స్ వచ్చాయి. సందకారి కాన్సెప్ట్, శ్రియా, విమల్ యాక్టింగ్‌పై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.
బెస్ట్ మూవీగా అవార్డ్...
ఈ ఏడాది ఆరంభంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన సినిమా అవార్డుల్లో ఉత్తమ తృతీయ తమిళ మూవీగా సందకారికి అవార్డు వచ్చింది. థియేటర్లలో రిలీజ్ కాకముందే ఈ సినిమాకు అవార్డు ఇవ్వడంపై అప్పట్లో విమర్శలు భారీగానే వచ్చాయి. సందకారి థియేటర్లలో డిజాస్టర్‌గా నిలవడంతో మరోసారి అవార్డుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఉత్తమ సినిమాగా ఏ ప్రతిపాదికన ఈ సినిమాను సెలెక్ట్ చేశారో చెప్పాలంటూ కామెంట్లు పెడుతోన్నారు. అవార్డు కమిటీ మెంబర్స్ అయిన చివరి వరకు ఈ సినిమాను చూశారా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
అబద్దపు పెళ్లి...
విదేశాల్లో ఓ కార్పొరేట్ కంపెనీకి బాస్ అయిన అత్యవసర పని నిమిత్తం ఇండియా రావాలని అనుకుంటుంది. వీసా సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్రాబ్లెమ్స్ నుంచి గట్టెక్కడానికి తన ఆఫీస్‌లోనే పనిచేసే ఓ యువకుడిని అబద్దపు పెళ్లి చేసుకుంది. అతడితో కలిసి ఇండియా వస్తుంది. ఈ జర్నీలో వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Godavarikhani Young Woman Murdered Case | మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని చంపేశాడు
- ●INDW vs BANW | ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. శ్రీలంకతో గోల్డ్ మెడల్ పోరు
- ●TG Weather | తెలంగాణలో వానలే వానలు.. ఈ నెల 26 వరకు అతిభారీ వర్షాలే.. ఐఎండీ వార్నింగ్..!
- ●Ponnam Prabhakar | బీసీల లెక్క తేలితేనే వారికి న్యాయం చేయగలం
- ●Shruti Sodhi | టాలీవుడ్ కమెడియన్‌తో పటాస్ హీరోయిన్ మూవీ - గుడ్‌బాయ్స్ ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Harish Rao | చామల, ఐలయ్యకు దమ్ముంటే సబ్స్టేషన్ల వద్ద చర్చకు రావాలి

Godavarikhani Young Woman Murdered Case | మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని చంపేశాడు

INDW vs BANW | ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. శ్రీలంకతో గోల్డ్ మెడల్ పోరు

TG Weather | తెలంగాణలో వానలే వానలు.. ఈ నెల 26 వరకు అతిభారీ వర్షాలే.. ఐఎండీ వార్నింగ్..!

Ponnam Prabhakar | బీసీల లెక్క తేలితేనే వారికి న్యాయం చేయగలం






