INDW vs BANW | ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. శ్రీలంకతో గోల్డ్ మెడల్ పోరు
INDW vs BANW | భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా క్రీడలు-2026లో ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌కు కనీసం రజత పతకం ఖాయమైంది.
INDW vs BANW | భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా క్రీడలు-2026లో ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌కు కనీసం రజత పతకం ఖరారైంది. సెప్టెంబరు 22న జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ మెరుపు శతకంతో అదరగొట్టింది. కేవలం 49 బంతుల్లోనే 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. స్మృతి మంధాన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 40 పరుగులు చేసింది.
81 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 15.4 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. దిలారా అక్తర్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. సుల్తానా ఖతున్ 12, షర్మిన్ అక్తర్ 10 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో ఎవరూ రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు. భారత బౌలర్లలో నందిని శర్మ, దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. శ్రీ చరణి రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. మరో సెమీఫైనల్లో శ్రీలంక.. పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. దీంతో సెప్టెంబర్ 22న భారత్, శ్రీలంక మధ్య గోల్డ్ మెడల్ కోసం పోరు జరుగనుంది. అదే రోజు కాంస్య పతకం కోసం బంగ్లాదేశ్, పాకిస్థాన్ తలపడతాయి. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లోనూ భారత మహిళల జట్టు క్రికెట్‌లో స్వర్ణ పతకం సాధించింది. తాజా టోర్నీలోనూ ఫైనల్‌కు చేరడంతో టైటిల్ నిలబెట్టుకునే అవకాశం ఉన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TG Weather | తెలంగాణలో వానలే వానలు.. ఈ నెల 26 వరకు అతిభారీ వర్షాలే.. ఐఎండీ వార్నింగ్..!
సెప్టెంబర్ 20, 2026

Lay Off | పోర్షేలో మరో 4,100 ఉద్యోగాల కోత..? ఆమోదం తెలిపిన వోక్స్ వ్యాగన్ సూపర్వైజరీ బోర్డు..!
సెప్టెంబర్ 20, 2026

Brahmotsavam 2026 | హనుమంత వాహనంపై కోదండరాముడిగా.. నేత్రపర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.!
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●TG Weather | తెలంగాణలో వానలే వానలు.. ఈ నెల 26 వరకు అతిభారీ వర్షాలే.. ఐఎండీ వార్నింగ్..!
- ●Ponnam Prabhakar | బీసీల లెక్క తేలితేనే వారికి న్యాయం చేయగలం
- ●Shruti Sodhi | టాలీవుడ్ కమెడియన్‌తో పటాస్ హీరోయిన్ మూవీ - గుడ్‌బాయ్స్ ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Harish Rao | చామల, ఐలయ్యకు దమ్ముంటే సబ్స్టేషన్ల వద్ద చర్చకు రావాలి
- ●Lay Off | పోర్షేలో మరో 4,100 ఉద్యోగాల కోత..? ఆమోదం తెలిపిన వోక్స్ వ్యాగన్ సూపర్వైజరీ బోర్డు..!
- ●Mrunal Thakur | నాలుగేళ్ల క్రితం షూటింగ్ పూర్తి - డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ - "ఏ" సర్టిఫికెట్తో రిలీజ్

TG Weather | తెలంగాణలో వానలే వానలు.. ఈ నెల 26 వరకు అతిభారీ వర్షాలే.. ఐఎండీ వార్నింగ్..!

Ponnam Prabhakar | బీసీల లెక్క తేలితేనే వారికి న్యాయం చేయగలం

Shruti Sodhi | టాలీవుడ్ కమెడియన్‌తో పటాస్ హీరోయిన్ మూవీ - గుడ్‌బాయ్స్ ఫస్ట్ లుక్ రిలీజ్

Harish Rao | చామల, ఐలయ్యకు దమ్ముంటే సబ్స్టేషన్ల వద్ద చర్చకు రావాలి



