త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malavika Mohanan | మాళ‌విక‌కు వ‌రుస ఫ్లాపులు.. ఈ ఏడాది క‌లిసిరాని భారీ బ‌డ్జెట్ సినిమాలు..!

Malavika Mohanan | హీరోయిన్ మాళ‌విక మోహనన్‌కు ఈ ఏడాది పెద్దగా కలిసి రావడం లేదు. సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌తో పాటు గ్లామర్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ భామ.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ అందుకోలేకపోతోంది. భారీ అంచనాలతో విడుదలైన వరుస సినిమాలు నిరాశపరచడంతో మాళ‌విక‌ కెరీర్‌లో 2026 డిజ‌ప్పాయింటింగ్ ఇయ‌ర్‌గా మారింది.

P

Entertainment | Published On Sep 16, 2026, 3.21 pm IST

Malavika Mohanan | మాళ‌విక‌కు వ‌రుస ఫ్లాపులు.. ఈ ఏడాది క‌లిసిరాని భారీ బ‌డ్జెట్ సినిమాలు..!
Advertisement

Malavika Mohanan | హీరోయిన్ మాళ‌విక మోహనన్‌కు ఈ ఏడాది పెద్దగా కలిసి రావడం లేదు. సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌తో పాటు గ్లామర్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ భామ.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ అందుకోలేకపోతోంది. భారీ అంచనాలతో విడుదలైన వరుస సినిమాలు నిరాశపరచడంతో మాళ‌విక‌ కెరీర్‌లో 2026 డిజ‌ప్పాయింటింగ్ ఇయ‌ర్‌గా మారింది. మలయాళ సినిమాలతో కెరీర్‌ ప్రారంభించిన మాళ‌విక‌.. తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌ సరసన నటించే ఛాన్స్‌ రావడంతో టాలీవుడ్‌లో ఆమెపై అంచనాలు మరింత పెరిగాయి.

ప్రభాస్‌ సినిమాతో గ్రాండ్‌ ఎంట్రీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్‌’తో మాళ‌విక టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్‌ వంటి పాన్‌ ఇండియా స్టార్‌ సరసన హీరోయిన్‌గా నటించడం ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్‌ ఇస్తుందని అంతా భావించారు. ఈ సినిమాతో తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఏర్పడుతుందని మాళ‌విక ఆశలు పెట్టుకుంది. అయితే, సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘ది రాజా సాబ్‌’కు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. బాక్సాఫీస్‌ వద్ద కూడా సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఈ సినిమా మాళ‌వికకు టాలీవుడ్‌లో సాలిడ్‌ లాంచ్ అందించ‌లేక‌పోక‌పోయింది. ప్రభాస్‌తో నటించినప్పటికీ.. ఆ తర్వాత తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని భావించినా ఆ ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. ఇక ఈ ఏడాది మాళ‌విక నటించిన మరో హైప్రొఫైల్‌ మూవీ ‘సర్దార్‌ 2’. కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్‌’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. తొలి భాగం విజయవంతం కావడంతో ‘సర్దార్‌ 2’పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మాళ‌విక హీరోయిన్‌గా నటించడంతో పాటు స్పై పాత్రలో కనిపించింది.

క‌లిసిరాని కాలం..

సరికొత్త లుక్‌, యాక్షన్‌ సన్నివేశాలతో మాళ‌విక పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావించారు. అయితే, మూవీ రిలీజ్ త‌ర్వాత అంచనాలకు తగ్గట్టుగా సినిమా బాక్సాఫీస్‌ వద్ద రాణించలేకపోయింది. తమిళంతో పాటు తెలుగు మార్కెట్‌లోనూ ‘సర్దార్ ‘సర్దార్‌ 2’ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. దీంతో ఈ సినిమా కూడా మాళ‌విక ఖాతాలో మరో పరాజయ చేరింది. వరుసగా రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరచడంతో ఈ ఏడాది ఆమెకు అంతగా కలిసి రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాళ‌వికకు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె అందం, నటన, తెరపై కనిపించే తీరు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రేజ్‌కు తగ్గట్టుగా ఆమె నటించిన సినిమాలు వసూళ్లు సాధించకపోవడం గమనార్హం. ముఖ్యంగా స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినప్పటికీ.. అవి ఆమె కెరీర్‌కు ఆశించిన స్థాయిలో ఉపయోగపడటం లేదు.

ఒక్క హిట్ దొరికితే..

‘ది రాజా సాబ్‌’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మాళ‌విక.. ఈ సినిమాతో టాలీవుడ్‌లో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించింది. కానీ, సినిమా ఫలితం ఆమె అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పుడు ‘సర్దార్‌ 2’ కూడా పరాజయం పాలవడంతో తెలుగులో ఆమె త‌ర్వాత నిర్ణ‌యంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మాళ‌వికకు అవసరమైంది ఓ మంచి హిట్‌. కథ, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాతో పాటు ప్రేక్షకులను మెప్పించే కమర్షియల్‌ హిట్‌ వస్తే ఆమె కెరీర్‌ మళ్లీ ఊపందుకునే అవకాశాలున్నాయి. మరి రాబోయే సినిమాతోనైనా మాళ‌విక తన ఖాతాలో ఓ విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి. ప్ర‌స్తుతం పాకెట్ నావ‌ల్ మూవీలో న‌టిస్తోంది. ఈ మూవీలో విజ‌య్ సేతుప‌తితో జ‌త‌క‌డుతోంది.

Advertisement
Advertisement