త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruti Sodhi | టాలీవుడ్ క‌మెడియ‌న్‌తో ప‌టాస్ హీరోయిన్ మూవీ – గుడ్‌బాయ్స్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

ప‌టాస్ హీరోయిన్ శృతి సోధి లాంగ్ గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది. క‌మెడియ‌న్ వెన్నెల‌కిషోర్‌తో ఓ సినిమా చేసింది. గుడ్‌బాయ్స్ పేరుతో రూపొందిన ఈ మూవీలో శృతి సోధి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Sep 20, 2026, 4.24 pm IST

Shruti Sodhi |  టాలీవుడ్ క‌మెడియ‌న్‌తో ప‌టాస్ హీరోయిన్ మూవీ – గుడ్‌బాయ్స్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌
Advertisement

Shruti Sodhi |  నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందిన ప‌టాస్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది శృతి సోధి. ఈ సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత తెలుగులో చాలానే సినిమాలు చేసింది. కానీ హిట్టు మాత్రం అందుకోలేక‌పోయింది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో ఓ కామెడీ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. క‌మెడియ‌న్ వెన్నెల‌కిషోర్‌తో ఓ సినిమా చేయ‌బోతుంది శృతి సోధి.

గుడ్‌బాయ్స్‌...

ఈ సినిమాకు గుడ్‌బాయ్స్ అనే పేరును ఖ‌రారు చేశారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో వెన్నెల‌కిషోర్ ఛైర్‌లో కూర్చొని ఉండ‌గా... అత‌డి చుట్టూ వివిధ గెట‌ప్‌ల‌లో వైవా హ‌ర్ష‌, శృతి సోధి, ర‌వి రాజా, గుండు సుద‌ర్శ‌న్ క‌నిపిస్తున్నారు.

వీళ్లు హీరోలు కాదు...

వీళ్లు హీరోలు కాదు.. అసలు హీరోలకు దగ్గరగా కూడా రారు. కానీ విలన్లను ఎదుర్కొనేంత పిచ్చి ఉన్నవాళ్లు మాత్రం వీళ్లే’ అంటూ పోస్ట‌ర్‌కు మేక‌ర్స్ ఓ ట్యాగ్‌టైన్ ఇచ్చారు.ఈ ట్యాగ్‌టైన్ ఆస‌క్తిని పంచుతోంది. ఈ సినిమాలో శృతి సోది ఫ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. గ్యాంగ్‌కు లీడ‌ర్‌గా వెన్నెల కిషోర్ యాక్టింగ్‌, అత‌డి కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.

త్వ‌ర‌లో రిలీజ్‌...

ఈ సినిమాకు రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గుడ్‌బాయ్స్ షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను సూర్య గుణ్ణం, వివేక్ ఇనంపూడి, నవ్య శశాంక్ కనకమేడల నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే గుడ్ బాయ్స్ మూవీ నుంచి ‘కజిన్స్ ఆర్ కమింగ్’ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియా సాంగ్‌ను రిలీజ్ చేశారు.

మీలో ఎవ‌రూ కోటీశ్వ‌రుడు...

ప‌టాస్‌తో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది శృతి సోది . తొలి అడుగులోనే పెద్ద విజ‌యాన్ని అందుకున్నా ఆ స‌క్సెస్‌ను క్యాష్ చేసుకోలేక‌పోయింది. ప‌టాస్ త‌ర్వాత‌ తెలుగులో మీలో ఎవ‌రూ కోటీశ్వ‌రుడు, ఒక ప‌థ‌కం ప్ర‌కారం సినిమాల్లో క‌థానాయిక‌గా క‌నిపించింది. మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ సుప్రీల్‌లో స్పెష‌ల్ సాంగ్ చేసింది. ఇవేవీ ఆమెకు పేరు తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి.

 

Advertisement
Advertisement