Suriya-Jyothika | 20 ఏళ్ల తర్వాత మరోసారి సూర్య–జ్యోతిక పెళ్లి!
Suriya-Jyothika | తమిళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక మరోసారి పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ జంట తమ ప్రత్యేక రోజును డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. సెప్టెంబర్ 11న 20వ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకున్న సూర్య–జ్యోతిక.. విదేశాల్లో వెస్ట్రన్ స్టైల్‌లో వౌ రీన్యూవల్ వేడుకను నిర్వహించారు.
Entertainment | Published On Sep 16, 2026, 5.15 pm IST
Suriya-Jyothika | తమిళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక మరోసారి పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ జంట తమ ప్రత్యేక రోజును డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. సెప్టెంబర్ 11న 20వ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకున్న సూర్య–జ్యోతిక.. విదేశాల్లో వెస్ట్రన్ స్టైల్‌లో వౌ రీన్యూవల్ వేడుకను నిర్వహించారు. తాజాగా ఈ స్పెషల్ మూమెంట్స్‌కు సంబంధించిన మరిన్ని ఫొటోలను జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ది సీక్వెల్’ పేరుతో జరిగిన ఈ వేడుకలో సూర్య, జ్యోతిక ట్రెడిషనల్ క్రిస్టియన్ వెడ్డింగ్ అటైర్‌లో కనిపించారు. సూర్య బర్గండీ కలర్ బ్లేజర్‌లో, జ్యోతిక లావెండర్ గౌన్‌లో మెరిశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సెలబ్రేషన్‌లో సూర్య–జ్యోతికల పిల్లలు దేవ్, దియా కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. జ్యోతిక వెంట కుమారుడు దేవ్, సూర్య వెంట కుమార్తె దియా వేడుకలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఒకరినొకరు వివాహ ప్రమాణాలు చేసుకుంటున్న సమయంలో పిల్లలు వారి పక్కనే ఉండటం ఈ వేడుకలో ప్రత్యేకమైన మూమెంట్‌గా నిలిచింది. ఈ స్పెషల్ డేను మరింత గ్రాండ్‌గా, మెమొరబుల్‌గా మార్చిన వారందరికీ జ్యోతిక ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. వెడ్డింగ్ ప్లానింగ్‌లో కీలక పాత్ర పోషించిన ఇంద్రజిత్, తిజా ఇంద్రజిత్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వెడ్డింగ్ కోఆర్డినేటర్ లిసా బెవర్.. మేకప్, ఫ్లోరల్స్, ఇన్విటేషన్స్, ట్రావెల్ తదితర ఏర్పాట్లను సమన్వయం చేసిన విధానాన్ని జ్యోతిక ప్రశంసించారు.
ఈ వేడుక కోసం మూడు నెలల పాటు కష్టపడి తమకు ప్రత్యేకమైన డ్రెస్సింగ్ అందించిన రాధికా మెహ్రాతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేసిన స్నేహితులకు కూడా జ్యోతిక కృతజ్ఞతలు తెలిపారు. ‘మా ఆనందంలో భాగమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ ఆమె పేర్కొన్నారు. 2006లో వివాహ బంధంతో ఒక్కటైన సూర్య–జ్యోతిక.. ఇన్నేళ్లుగా తమ ఫ్యామిలీ లైఫ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు 20 ఏళ్ల మ్యారేజ్ జర్నీని మరోసారి వెడ్డింగ్ సెలబ్రేషన్‌తో గుర్తు చేసుకోవడంతో ఈ స్టార్ కపుల్ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి
- ●Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..
- ●Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం
- ●KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!
- ●Oil Palm Cultivation Telangana | ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణే టాప్
- ●Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. అక్టోబర్ 9 నుంచి భారీ సేల్..

Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి

Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..

Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం

KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!





