TG Weather | తెలంగాణలో వానలే వానలు.. ఈ నెల 26 వరకు అతిభారీ వర్షాలే.. ఐఎండీ వార్నింగ్..!
TG Weather | మొన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరైన తెలంగాణను మళ్లీ వర్షాలు పలకరిస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారడంతో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుండడం, దాని ప్రభావంతో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.
TG Weather | మొన్నటి వరకు ఎండలతో ఉక్కిరిబిక్కిరైన తెలంగాణను మళ్లీ వర్షాలు పలకరిస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారడంతో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుండడం, దాని ప్రభావంతో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయం 8.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంపై కేంద్రీకృతమైంది. ఇది మరింత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
అల్పపీడనం..
అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 23న ఉదయం ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీరాల సమీపంలోని పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతాన్ని చేరే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తూర్పు–పశ్చిమ ద్రోణి విస్తరించింది. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉంది. మరోవైపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణలో రానున్న వారం రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..
ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది. సోమవారం రాష్ట్రంలోని మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆరెంజ్ అలెర్ట్ జారీ..
మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. అలాగే, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఈదురుగాలులతో కూడిన వానలు..
గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో ఉరుములు, మెరుపులతో అతి భారీ వర్షాలు పడుతాయని.. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. శుక్రవారం, శనివారాల్లోనూ తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | బీసీల లెక్క తేలితేనే వారికి న్యాయం చేయగలం
- ●Shruti Sodhi | టాలీవుడ్ కమెడియన్‌తో పటాస్ హీరోయిన్ మూవీ - గుడ్‌బాయ్స్ ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Harish Rao | చామల, ఐలయ్యకు దమ్ముంటే సబ్స్టేషన్ల వద్ద చర్చకు రావాలి
- ●Lay Off | పోర్షేలో మరో 4,100 ఉద్యోగాల కోత..? ఆమోదం తెలిపిన వోక్స్ వ్యాగన్ సూపర్వైజరీ బోర్డు..!
- ●Mrunal Thakur | నాలుగేళ్ల క్రితం షూటింగ్ పూర్తి - డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ - "ఏ" సర్టిఫికెట్తో రిలీజ్
- ●Brahmotsavam 2026 | హనుమంత వాహనంపై కోదండరాముడిగా.. నేత్రపర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.!

Ponnam Prabhakar | బీసీల లెక్క తేలితేనే వారికి న్యాయం చేయగలం

Shruti Sodhi | టాలీవుడ్ కమెడియన్‌తో పటాస్ హీరోయిన్ మూవీ - గుడ్‌బాయ్స్ ఫస్ట్ లుక్ రిలీజ్

Harish Rao | చామల, ఐలయ్యకు దమ్ముంటే సబ్స్టేషన్ల వద్ద చర్చకు రావాలి

Lay Off | పోర్షేలో మరో 4,100 ఉద్యోగాల కోత..? ఆమోదం తెలిపిన వోక్స్ వ్యాగన్ సూపర్వైజరీ బోర్డు..!



