త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shraddha Kapoor | బాయ్ ఫ్రెండ్ డైరెక్ష‌న్‌లో సినిమా – బాలీవుడ్ సీనియ‌ర్ హీరోతో శ్ర‌ద్ధా క‌పూర్ రొమాన్స్‌

బాలీవుడ్ డైరెక్ట‌ర్ రాహుల్ మోడీతో శ్ర‌ద్ధాక‌పూర్ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు స‌న్నిహితులు చెబుతోన్నారు. తాజాగా ప్రియుడు రాహుల్ మోడీ డైరెక్ష‌న్‌లో శ్ర‌ద్ధాక‌పూర్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Apr 20, 2026, 4.27 pm IST

Shraddha Kapoor | బాయ్ ఫ్రెండ్ డైరెక్ష‌న్‌లో సినిమా – బాలీవుడ్ సీనియ‌ర్ హీరోతో శ్ర‌ద్ధా క‌పూర్ రొమాన్స్‌
Advertisement

Shraddha Kapoor |  బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్... డైరెక్ట‌ర్ రాహుల్ మోడీ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదే వీరిద్ద‌రు పెళ్లిపీట‌లు ఎక్క‌నున్న‌ట్లు చెబుతున్నారు. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ న‌టించిన తూ ఝూతీ మే మ‌క్క‌ర్ సినిమాకు రాహుల్ మోడీ రైట‌ర్‌గా ప‌నిచేశారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ట‌. గ‌త రెండేళ్లుగా రాహుల్‌తో శ్ర‌ద్ధా పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంద‌ని అంటున్నారు.

బాయ్ ఫ్రెండ్ డైరెక్ష‌న్‌లో...

తాజాగా బాయ్‌ఫ్రెండ్ రాహుల్ మోడీ డైరెక్ష‌న్‌లో  శ్ర‌ద్ధాక‌పూర్ ఓ సినిమా చేయ‌బోతుంది. భార‌త్ పే మ‌నీ యాప్ రూప‌క‌ర్త అశ్నీర్ గ్రోవ‌ర్ జీవితం ఆధారంగా ఓ హిందీ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ బ‌యోపిక్‌లో టైటిల్ రోల్‌లో ఆమిర్‌ఖాన్ న‌టించ‌బోతున్నాడ‌ట‌. రాహుల్ మోడీ క‌థ‌ను అందిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్ స‌ర‌స‌న శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు టాక్‌. అశ్నీర్ గ్రోవ‌ర్ భార్య మాధురి జైన్ పాత్ర‌లో శ్ర‌ద్ధా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్రియుడే ద‌ర్శ‌కుడు కావ‌డంతో క‌థ విన‌కుండానే శ్ర‌ద్ధా ఈ సినిమాకు ఓకే చెప్పిన‌ట్లు తెలిసింది.

ఓటీటీ షో...

భార‌త్ పే ఫౌండ‌ర్ అయిన అశ్నీర్‌..సోనీ లివ్ ఓటీటీలో టెలికాస్ట్ అవుతోన్న షో షార్క్ ట్యాంక్ ఇండియా రియాలిటీ షోకు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. ఈ షోలో రాహుల్ స్పీచ్‌లు, ఆయ‌న వేసే పంచ్‌లు, కౌంట‌ర్లు యూత్‌లో బాగా ఫేమ‌స్ అయ్యాయి. భార‌త్ పే లాంఛ్ చేయ‌డానికి ఆయ‌న ప‌డిన క‌ష్టాలు, ఈ సంస్థ ఎదుర్కొన్న వివాదాల‌ను చాలా సార్లు అభిమానుల‌తో పంచుకున్నారు. అశ్నీర్ లైఫ్‌లో సినిమాకు కావాల్సినంత ఉండ‌టంతోనే అత‌డి బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి ఆమిర్ ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్‌...

ఈ బ‌యోపిక్‌లో ఆమిర్‌ఖాన్‌కు జోడీగా శ్ర‌ద్ధాక‌పూర్‌ను ఎంపిక‌చేయ‌డంపై అభిమానుల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్‌పై నెగెటివ్ కామెంట్లు పెడుతోన్నారు. ఆమిర్ ఖాన్ వ‌య‌సు 61 ఏళ్లు కాగా...శ్ర‌ద్ధా క‌పూర్‌కు 39 ఏళ్లు ఉన్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య 22 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. వీరిద్ద‌రి జోడీ సెట్ కాద‌ని అంటున్నారు.

 

Advertisement
Advertisement