Horror OTT | ఓటీటీలోకి మైండ్‌బ్లాక్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు హారర్ మూవీ – కాటేరమ్మ కథతో
శ్రద్ధా దాస్ హీరోయిన్‌గా నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ త్రికాల సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హారర్ మూవీలో మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని కీలక పాత్రల్లో నటించారు.
Entertainment | Published On Jul 10, 2026, 7.20 pm IST
Horror OTT | శ్రద్ధా దాస్ తెలుగులో చాలానే సినిమాలు చేసింది. స్టార్ హీరోలతో జోడీ కట్టింది. కానీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనే పేరు, గుర్తింపు మాత్రం ఈ హాట్ బ్యూటీకి దక్కలేదు. తెలుగులో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించిన శ్రద్ధా దాస్ ఇటీవలే త్రికాల పేరుతో సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా చేసింది. మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవంచ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణి తెల్లగూటి దర్శకత్వం వహించాడు.
థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ తెలుగు హారర్ మూవీ ఇటీవలే సన్ నెక్స్ట్‌లో రిలీజైంది. తాజాగా మరో ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
సనాతన ధర్మం...
విభిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు త్రికాల కథను రాసుకున్నాడు. అనుభవలేమితో పాటు బడ్జెట్ పరిమితుల కారణంగా స్క్రీన్‌పై ఆసక్తికరంగా చెప్పడంలో తడబడిపోయాడు. హారర్ అంశాలతో పాటు సనాతన ధర్మం పాయింట్‌ను ఈ సినిమాలో టచ్ చేశారు. ఇందులో శ్రద్ధా దాస్ సైకాలజిస్ట్ పాత్రలో కనిపించింది.
కాటేరమ్మ కథతో...
రాజవంశానికి చెందిన వైతరణ్ సూర్యుడిని చూడలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. ఆ వ్యాధి కారణంగా ఊరికి దూరంగా ఉన్న ఓ పెద్ద బంగళాలో ఎప్పుడూ చీకటిలోనే బతుకుతుంటాడు. అతడి గత జన్మ తాలూకు ఓ రహస్య అనుకోకుండా బయటపడుతుంది. నిధి అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. నిధి గురించి అతడి ప్రియుడు శివ వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే కాటేరమ్మ తల్లి గురించి శివకు తెలుస్తుంది? ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో శివకు ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? వైతరణ్ జీవితంలోకి వచ్చిన మాయ ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
యానిమల్ ఫేమ్...
త్రికాల మూవీకి యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించాడు. మే నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శ్రద్ధా దాస్. అధినేత, ఆర్య 2, డైరీ, మరో చరిత్ర, నాగవల్లితో పాటు పలు సినిమాలు చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | ఓటీటీలోకి అదితిరావ్ హైదరీ బోల్డ్ మూవీ – నలుగురు హీరోయిన్లు – నాలుగు కథలు
ఆగస్టు 24, 2026

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ – సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆగస్టు 20, 2026

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు ఫాంటసీ కామెడీ మూవీ – సూర్య కరుప్పుతో కంపేరిజన్స్
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం
- ●South Heroines | సౌత్‌లో ఒకలా.. నార్త్‌లో మరోలా! పాన్ ఇండియా కోసం బోల్డ్ రోల్స్‌కు సై..!
- ●Konda Sushmitha | జనసేనలోకి కొండా సుష్మిత.. క్లారిటీ ఇచ్చిన పార్టీ
- ●PJTAU | 27 నుంచి అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ

Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి

Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

South Heroines | సౌత్‌లో ఒకలా.. నార్త్‌లో మరోలా! పాన్ ఇండియా కోసం బోల్డ్ రోల్స్‌కు సై..!



