Shraddha Das | సనాతన ధర్మం కాన్సెప్ట్‌తో శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ – ఈ సారైనా హిట్టు దక్కేనా?
రెండేళ్ల గ్యాప్ తర్వాత ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీతో శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రికాల టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ మే 29న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించారు.
Entertainment | Published On May 17, 2026, 5.28 pm IST
Shraddha Das | భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాల ఆధారంగా టాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా దాస్ ఓ మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నది. ‘త్రికాల’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ మే 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో శ్రద్దాదాస్‌తో పాటు మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. త్రికాల మూవీకి మణి తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నారు.
సైకాలజిస్ట్...
ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుందని మేకర్స్ వెల్లడించారు. ఇందులో శ్రద్దాదాస్ సైకాలజిస్ట్ పాత్రలో కనిపించబోతుంది. తాంత్రిక శక్తులను అడ్డుపెట్టుకొని ప్రపంచ వినాశనానికి కుట్రలు చేసిన క్షుద్ర అనే మాంత్రికుడిని ఓ యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో ఎదురైన పరిణామాలేమిటనే అంశాలతో త్రికాల మూవీ తెరకెక్కనుంది.
అర్జున్ రెడ్డి ఫేమ్...
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల ఫేమ్ హర్షవర్ధన్ రమేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అతడి బీజీఎమ్ త్రికాల మూవీకి హైలైట్‌గా నిలవబోతుంది. మైథలాజికల్ కాన్సెప్ట్‌లను ఇష్టపడే ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది అని మేకర్స్ అన్నారు. త్రికాల మూవీలో సాహితి అవంచ, ప్రభాకర్, అంబటి అర్జున్, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం...
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. ఆర్య 2, గుంటూరు టాకీస్, ఏక్ మినీ కథ, డిక్టేటర్, నాగవల్లి తో పాటు పలు సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ విజయాలు మాత్రం దక్కలేదు. రెండేళ్ల గ్యాప్ తర్వాత త్రికాల మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతోనైనా శ్రద్ధా దాస్‌కు సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సిందే.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



