Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు – హీరోయిన్‌గా రాజశేఖర్ కూతురు
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరోయిన్ రన్యారావు జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. సిటీ ఆఫ్ గోల్డ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో టాలీవుడ్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్‌గా నటించబోతుంది. .
Entertainment | Published On Sep 26, 2026, 6.45 pm IST
Kollywood | కన్నడ హీరోయిన్ రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని సెలిబ్రిటీ హోదాలో విదేశాల నుంచి వంద కోట్లకుపైగా బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చినట్లు రన్యారావుపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కేసులో రిమాండ్ ఖైదీగా రన్యారావు జైలు శిక్షను అనుభవిస్తోంది. ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ రాబోతుంది. సిటీ ఆఫ్ గోల్డ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ అమలా షాజీ మరో నాయికగా కనిపించనున్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. స్మగ్లింగ్ మాఫియాలో చిక్కుకున్న కొందరు అమాయకుల జీవితాల నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా సాగింది.
అక్రమ రవాణా...
రన్యారావు తో పాటు పలు బంగారం స్మగ్లింగ్ కేసుల ఆధారంగా దర్శకుడు సిద్ధార్థ్ ఈ మూవీని రూపొందిస్తోన్నట్లు చెబుతోన్నారు. ఈ సినిమా రూపొందుతోంది. డిసెంబర్ 24న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ కాబోతుంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కాకముందు రన్యారావు హీరోయిన్‌గా తమిళం, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది. వాటిలో వాఘా ఒకటి. విక్రమ్ ప్రభు హీరోగా నటించిన ఈ సినిమాలో రన్యారావు కథానాయికగా కనిపించింది. ఇప్పుడు రన్యారావు జీవితంపైనే విక్రమ్ ప్రభు సినిమా చేయబోతుండటం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
దొరసాని...
దొరసాని మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్. పంచతంత్రం, రంగమార్తండ సినిమాల్లో ఆమె నటనకు మంచి పేరొచ్చింది. అయినా టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌కు షిప్ట్ అయ్యింది. ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ – లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్
సెప్టెంబర్ 26, 2026

Kayadu Lohar | స్టూడెంట్ లీడర్‌గా కయదు లోహర్ – నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో తమిళ సినిమా
సెప్టెంబర్ 26, 2026

Shruti Haasan | ఒంటిపై టాటూతో శృతి హాసన్ …అర్థం ఏమిటో తెలుసా?
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు
- ●Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి
- ●Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి
- ●Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!

Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి

Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్

Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం



