త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | స్టూడెంట్ లీడ‌ర్‌గా క‌య‌దు లోహ‌ర్ – నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌తో త‌మిళ సినిమా

2026లో క‌య‌దు లోహ‌ర్ జోరు కొన‌సాగుతోంది. తొమ్మిది నెల‌ల్లో ఈ అస్సాం బ్యూటీ న‌టించిన ఆరు సినిమాలు రిలీజ‌య్యాయి. తాజాగా త‌మిళంలో మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. శివ‌కార్తికేయ‌న్ హీరోగా నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ రామ్‌కుమార్ బాల‌కృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

N

News | Published On Sep 26, 2026, 2.06 pm IST

Kayadu Lohar | స్టూడెంట్ లీడ‌ర్‌గా క‌య‌దు లోహ‌ర్ – నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌తో త‌మిళ సినిమా
Advertisement

Kayadu Lohar |  2026లో క‌య‌దు లోహ‌ర్ హ‌వా కొన‌సాగుతోంది. ఈ ఏడాది తొమ్మిది నెల‌ల గ్యాప్‌లో క‌య‌దు లోహ‌ర్ న‌టించిన ఆరు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ప్ర‌మోష‌న్స్‌కు కూడా అటెండ్ అయ్యే తీరిక లేనంత బిజీగా ఉంది ఈ అస్సాం బ్యూటీ.

పార్కింగ్ మూవీ ఫేమ్‌...

వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో సినిమా చేస్తోన్న క‌య‌దు లోహ‌ర్‌ తాజాగా త‌మిళంలో మ‌రో బంప‌రాఫ‌ర్ అందుకుంది. శివ‌కార్తికేయ‌న్‌తో ఫ‌స్ట్ టైమ్ రొమాన్స్ చేయ‌బోతుంది. 2023లో రిలీజైన త‌మిళ మూవీ పార్కింగ్ మూడు నేష‌న‌ల్ అవార్డుల‌ను అందుకుంది. ఈ సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే బెస్ట్ స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా రామ్‌కుమార్ బాల‌కృష్ణ‌న్ జాతీయ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్నారు.

పూజా కార్య‌క్ర‌మాల‌తో...

పార్కింగ్ త‌ర్వాత త‌న రెండో సినిమాను కోలీవుడ్ అగ్ర హీరో శివ‌కార్తికేయ‌న్‌తో చేయ‌బోతున్నారు రామ్‌కుమార్ బాల‌కృష్ణ‌న్‌. శ‌నివారం చెన్నైలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో శివ‌కార్తికేయ‌న్‌కు జోడీగా క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఓపెనింగ్ ఈవెంట్‌కు హీరోతో పాటు క‌య‌దు లోహ‌ర్ కూడా అటెండ్ అయ్యింది.

స్టూడెంట్ లీడ‌ర్‌...

స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఇందులో శివ‌కార్తికేయ‌న్‌తో పాటు క‌య‌దు లోహ‌ర్ స్టూడెంట్ లీడ‌ర్స్‌గా క‌నిపిస్తార‌ని అంటున్నారు. క‌య‌దు పాత్ర‌లో వ‌చ్చే ట్విస్ట్‌లు అదిరిపోతాయ‌ని చెబుతున్నారు. శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తోన్న 27వ మూవీ ఇది. అక్టోబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంది.

మూడు కోట్లు...

శివ‌కార్తికేయ‌న్ సినిమా కోసం అస్సాం బ్యూటీ రెమ్యూన‌రేష‌న్‌ను పెంచిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు కోటి నుంచి కోటిన్న‌ర వ‌ర‌కు పారితోషికం డిమాండ్ చేస్తోంది. వ‌రుస ఆఫ‌ర్ల‌తో త‌న రెమ్యూన‌రేష‌న్‌ను డ‌బుల్ చేసింద‌ని అంటున్నారు. ఈ త‌మిళ సినిమాకు మూడు కోట్లు పారితోషికం స్వీక‌రించిన‌ట్లు చెబుతోన్నారు.

ప్యార‌డైజ్‌...

ఇటీవ‌లే ప్యార‌డైజ్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది క‌య‌దు లోహ‌ర్‌. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ సినిమాలో కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా బీగ్రేడ్ సినిమాల్లో న‌టించే హీరోయిన్‌గా బోల్డ్ రోల్‌లో క‌నిపించింది.

 

Advertisement
Advertisement