Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి
Minister Ponguleti | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన ఏ ఒక్క కుటుంబం ఇందిరమ్మ ఇల్లు విషయంలో నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇల్లు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
Minister Ponguleti | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన ఏ ఒక్క కుటుంబం ఇందిరమ్మ ఇల్లు విషయంలో నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇల్లు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రెస్టన్ కళాశాల మైదానంలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 500 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతోపాటు కాస్మోటిక్ ఛార్జీలను పెంచినట్లు తెలిపారు.
తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి.. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని పొంగులేటి తెలిపారు. దసరా నాటికి 2.18 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించామని.. జనగామ నియోజకవర్గానికి కూడా అదే సంఖ్యలో ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇంటి నిర్మాణం వివిధ దశలకు చేరుకున్న కొద్దీ ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని.. ప్రతి నియోజకవర్గానికి అదనంగా 2 వేల ఇళ్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పూరిగుడిసెలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుగా పూరిళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
అసంపూర్తి ఇళ్లకూ ఆర్థిక సాయం
జనగామ నియోజకవర్గంలో గుర్తించిన 500 పూరిళ్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లు, మొండిగోడల వద్ద ఆగిపోయిన ఇళ్లు, స్లాబ్ స్థాయిలో నిలిచిన ఇళ్లను పూర్తి చేసుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని రెండో విడతలో అమలు చేస్తున్నామని చెప్పారు. మూడో, నాలుగో విడతల్లోనూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో సేకరించిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలను గుర్తించి అర్హులకు పంపిణీ చేసి.. తదుపరి విడతల్లో అక్కడ కూడా ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.
జనగామ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.2 కోట్లు
గతంలో నిర్మాణం పూర్తికాని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నివాసయోగ్యంగా మార్చి లబ్ధిదారులకు అందించడం ప్రభుత్వ బాధ్యత అని పొంగులేటి అన్నారు. జనగామలో ఇందుకు అవసరమైన రూ.2 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దసరా నాటికి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. జనగామ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి తొలి విడతగా రూ.25 కోట్లు వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటికే శంకుస్థాపన చేసిన రూ.58–60 కోట్ల పనులతోపాటు టెండర్లు పూర్తయిన రూ.19 కోట్ల పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మహిళా సంఘాలకు రూ.70 వేల కోట్ల రుణాలు
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.70 వేల కోట్లకు పైగా సున్నా వడ్డీ రుణాలు అందించామని మంత్రి తెలిపారు. రైతు భరోసా కొనసాగిస్తున్నామని, వరి రైతులకు మద్దతు ధరతోపాటు సన్నవడ్లకు బోనస్ అందిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. మరో 14–15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుందని, ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను ప్రస్తావించారు.
అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి..
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.18.90 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తయ్యాయని, వాటిని వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వడ్లకొండ–శామీర్‌పేట్ బైపాస్ రోడ్డును డబుల్ లైన్ చేయడంతోపాటు చీటకోడూరు బ్రిడ్జి, గండిరామారం పంపుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Minister Seethakka | రూ.1000 కోట్లతో 5118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క
సెప్టెంబర్ 26, 2026

Rajanna Sircilla | సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
సెప్టెంబర్ 26, 2026

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం
- ●Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు
- ●Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి

KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం

Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు

Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్



